Bjp vs Ycp: ఆత్మకూర్ ఉప ఎన్నికల వేళ సోము వీర్రాజు హాట్ కామెంట్స్.. దుమ్ముంటే ఈ సవాల్ స్వీకరించాలంటూ..

Bjp vs Ycp: ఆత్మకూర్ ఉప ఎన్నికల వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీకి దమ్ముంటే తన ఛాలెంజ్ ని స్వీకరించాలన్నారు సోము.

Bjp vs Ycp: ఆత్మకూర్ ఉప ఎన్నికల వేళ సోము వీర్రాజు హాట్ కామెంట్స్.. దుమ్ముంటే ఈ సవాల్ స్వీకరించాలంటూ..
Ap Bjp Chief Somu Veerraju
Follow us

|

Updated on: Jun 05, 2022 | 9:09 AM

Bjp vs Ycp: ఆత్మకూర్ ఉప ఎన్నికల వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీకి దమ్ముంటే తన ఛాలెంజ్ ని స్వీకరించాలన్నారు సోము. ఎన్నికల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆత్మకూర్ బై ఎలక్షన్స్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టకుండా పోటీ చేసే దమ్ము వైసీపీ ఉందా అని ఛాలెంజ్ విసిరారు. మండలానికి ఇద్దరు మంత్రుల చొప్పున కాకుండా స్థానిక నేతలతో ప్రచారం చేద్దామన్నారు. సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ.. మీ సంక్షేమమేంటో, మోదీ సంక్షేమమేంటో ఆత్మకూర్ నియోజక వర్గ ప్రజలకు తెలియజేసి.. ఎవరి సత్తా ఎంటో తేల్చేకుందామని సవాల్ చేశారు సోము వీర్రాజు.

మొన్న జరిగిన మంత్రుల యాత్రపై కామెంట్స్ చేశారు సోము వీర్రాజు. బీసీలకు పెద్దపీట వేశామని చెప్పుకోవడం కాదు.. ఆత్మకూర్ లో బీసీ నేతకు టికెట్ ఇవ్వోచ్చుకదా అని ప్రశ్నించారు. అందుకే తాము బీసీ అభ్యర్థిని ప్రకటించామని చెప్పారు సోము. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ ఒకే మాటతో ఒకే మార్గంలో వెళ్తొందన్నారు. అందులో భాగంగానే తిరుపతి, బద్వేల్, ఆత్మకూర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెప్పారు. ఉప ఎన్నికల్లో సిద్దాంతాలు పాటించడం లేదని విమర్శించిన వైసీపీకి కౌంటర్ ఇచ్చారు వీర్రాజు. సిద్దాంతాలు పాటించే వైసీపీ నంద్యాల ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేసిందని ప్రశ్నించారు. మరోవైపు టీడీపీ పోటీచేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు సోమువీర్రాజు. సిద్దాంతాలు పాటించే టీడీపీ తిరుపతిలో ఎందుకు పోటీ చేశారో చెప్పాలన్నారు. పార్లమెంట్ కు ఒకమాట.. అసెంబ్లీ మరో మాట ఉంటుందా అని క్వశ్చన్ చేశారు సోము వీర్రాజు.