Srisailam: ఆ ఎమ్మెల్యే అండతోనే రజాక్ రెచ్చిపోతున్నాడు.. బీజేపీ నేతల తీవ్ర ఆరోపణలు..

|

Feb 16, 2022 | 1:54 PM

Srisailam: జ్యోతిర్లింగం, శక్తిపీఠం కొలువైన శ్రీశైలంలో అధికార పార్టీ నేత రజాక్ వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా మారుతోంది.

Srisailam: ఆ ఎమ్మెల్యే అండతోనే రజాక్ రెచ్చిపోతున్నాడు.. బీజేపీ నేతల తీవ్ర ఆరోపణలు..
Srisailam
Follow us on

Srisailam: జ్యోతిర్లింగం, శక్తిపీఠం కొలువైన శ్రీశైలంలో అధికార పార్టీ నేత రజాక్ వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. ఈ వివాదాల నేపథ్యంలోనే రజాక్ పై బీజేపీ నేతలు పదే పదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. అతి పవిత్రమైన శ్రీశైలంలో అన్యమతస్థుడైన రజాక్ పెత్తనం ఏంటి? అని బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. కర్నూలు జిల్లా బీజేపీ నేతలతో పాటు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లాటి వారు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అన్య మతస్థుడైన రజాక్.. తన భార్యను అడ్డుపెట్టుకుని శ్రీశైలంలో అధికారం చెలాయిస్తున్నాడని మండిపడుతున్నారు. శ్రీశైలంలోని దుకాణాలు, టెండర్లు, ఉద్యోగుల బదిలీలలో ఎలా జోక్యం చేసుకుంటారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉండగానే.. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. తాను డీఎస్పీ ని అంటూ లారీ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్‌తో రజాక్ మాట్లాడిన ఆడియో వెలుగులోకి వచ్చింది. ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రజాక్‌ను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.. తనకు తెలిసినంత వరకు రజాక్ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఫోన్‌కాల్ వ్యవహారంలో రజాక్ తప్పు ఉన్నందున తాను ఎలాంటి జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి. తప్పు ఎవరు చేసిన శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. కాగా, రజాక్ విషయంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై సరైన సమయంలో స్పందిస్తానని అన్నారు.

ఇదిలాఉండగా.. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి అండ చూసుకునే రజాక్ రెచ్చిపోతున్నాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. శ్రీశైలంలో జరిగే ప్రతి పనిలో రజాక్ ప్రమేయం ఉంటుందని, అందుకు కారణం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణినే అని అంటున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే.. అన్యమతస్తుడైన రజాక్‌కు శ్రీశైలం క్షేత్రంలో ప్రాముఖ్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also read:

Kacha Badam: పచ్చి బాదం ఎక్కువగా తింటున్నారా? మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లే..

Bjp vs Trs: మోడీని తరిమేస్తారా.. బికేర్ ఫుల్.. సీఎం కేసీఆర్‌కు బీజేపీ నేత సీరియస్ వార్నింగ్!

Andhra Pradesh: కర్నూలు వరుస ఘటన కలకలం.. ఓ చోట భారీ చోరీ.. మరో చోట మాత్రం..