Andhra Pradesh: గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఆటోలో అకస్మాత్తుగా మంటలు.. చివరకు ఏం జరిగిందంటే..?

| Edited By: Shaik Madar Saheb

Dec 07, 2023 | 4:14 PM

216వ జాతీయ రహదారిపై ఆటోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఆటో ముందు భాగంలో మంటలు వ్యాపించాయి. అయితే డ్రైవర్ శ్రీకాంత్ అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. భట్టిప్రోలు నుండి రవాణా ఆటోలో గ్యాస్ సిలెండర్లతో ఎప్పటిలాగే శ్రీకాంత్ ఐలవరం బయలుదేరాడు.

Andhra Pradesh: గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఆటోలో అకస్మాత్తుగా మంటలు.. చివరకు ఏం జరిగిందంటే..?
Fire Accident
Follow us on

గుంటూరు, డిసెంబర్ 07: 216వ జాతీయ రహదారిపై ఆటోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఆటో ముందు భాగంలో మంటలు వ్యాపించాయి. అయితే డ్రైవర్ శ్రీకాంత్ అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. భట్టిప్రోలు నుండి రవాణా ఆటోలో గ్యాస్ సిలెండర్లతో ఎప్పటిలాగే శ్రీకాంత్ ఐలవరం బయలుదేరాడు. అయితే భట్టిప్రోలు దాటిన కొద్ది సేపటికే ఆటో గమనంలో తేడా రావడాన్ని గమనించాడు. అనుమానం వచ్చి ఆటోను పక్కనే ఆపి కిందకి దిగి చూశాడు. అయితే ఆటో ఇంజన్ భాగంలో నుంచి చిన్న మంట రావటాన్ని గమనించాడు. వెంటనే శ్రీకాంత్ ఆటో గ్యాస్ సిలెండర్లు ఉండటం గమనించి ధైర్యంగా ఆటోలోని సిలెండర్లను కింద పడేశాడు. అయినా ముప్పు తప్పదని భావించి ఆటో మరికొద్ది దూరి తీసుకెళ్లి నిలిపివేశాడు.

ఆ తర్వాత మంటలు ఆటో మొత్తం వ్యాపించాయి. మంటల్లో ఆటో పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్ అప్రమత్తతోనే పెను ప్రమాదం తప్పింది. లేకుంటే గ్యాస్ సిలెండర్లు కూడా మంటల్లో పేలిపోయి ఉండేవి. అప్పటికే జాతీయ రహదారిపై వాహనాలు పరిగెడుతున్నాయి. అగ్ని ప్రమాదం జరిగిందని తెలియడంతోనే స్థానికులు ఆటో వద్దకు చేరుకున్నారుగాని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే, అవసరమైన నీరు లేకపోవడంతో చూస్తూ ఊరుకుండి పోయారు.

వీడియో చూడండి..

మొత్తం మీద డ్రైవర్ చురుగ్గా వ్యవహరించి పెను ప్రమాదం బారిన పడకుండా ధైర్యం వ్యవహరించడంపై స్థానికులు అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..