AP Elections 2024 Counting: ఏపీలో టీడీపీ హవా.. సీఎం జగన్ మినహా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ వెనుకంజ..

|

Jun 04, 2024 | 10:25 AM

ఏపీలో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోన్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్నారు. టీడీపీ కార్యాలయం వద్ద సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఏపీలో ఫలితాలు ఊహించేందుకు వీలు లేకుండా పోయింది. ఒక్క సీఎం జగన్ మినహా మిగిలిన వారందరూ వెనుకంజలో ఉన్నారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ 118 స్థానాల్లో, జనసేన 11 స్థానాల్లో, భాజపా 2 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.

AP Elections 2024 Counting: ఏపీలో టీడీపీ హవా.. సీఎం జగన్ మినహా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ వెనుకంజ..
Chandrababu, Pawan Kalyan
Follow us on

ఏపీలో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోన్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్నారు. టీడీపీ కార్యాలయం వద్ద సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఏపీలో ఫలితాలు ఊహించేందుకు వీలు లేకుండా పోయింది. ఒక్క సీఎం జగన్ మినహా మిగిలిన వారందరూ వెనుకంజలో ఉన్నారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ 118 స్థానాల్లో, జనసేన 11 స్థానాల్లో, భాజపా 2 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక వైసీపీ ప్రస్తుతం 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్‌, రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజలో ఉన్నారు. స్పీకర్‌ తమ్మినేని వెనుకంజంలో ఉన్నారు. రాజకీయంగా తలపండిన సీనియర్ నాయకులు, హేమాహేమీలందరూ వెనుకంజలో ఉన్నారు.

పిన్నేపి విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల్, దాడిశెట్టి రాజా, తానేటి వనిత వీరందరూ వెనుకంజలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్‌ కూడా మూడవ రౌండ్ పూర్తయ్యే సరికి 13వేల ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో టిడిపి అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు. ఏపీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కూటమి అభ్యర్థుల లీడ్‌లో కొనసాగుతున్నారు. ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ, జమ్మలమడుగు తెదేపా అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, తాడికొండలో తెదేపా అభ్యర్థి తెనాలి శ్రవణ్‌కుమార్‌, తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌, పాలకొల్లులో తెదేపా అభ్యర్థి నిమ్మల రామానాయుడు, సంతనూతలపాడు తెదేపా అభ్యర్థి విజయ్‌కుమార్‌, గురజాలలో 1311 ఓట్ల ఆధిక్యంలో తెదేపా అభ్యర్థి యరపతినేని కొనసాగుతున్నారు. కళా వెంకట్రావు కూడా ఆధిక్యంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ కేంద్రాల నుంచి  కొడాలి నాని, వల్లభనేని వంశీ వెళ్లిపోయారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని ఏపీ లైవ్ అప్డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..