AP Assembly Budget Session 2022-23: మార్చి నెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022-23 సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు సమావేశాల ప్రారంభ తేదీలను ఖరారు చేసింది సర్కార్. మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలకు సంబంధించి.. అధికారులను అలర్ట్ చేసింది సర్కార్. శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులకు ఆర్థికశాఖ లేఖ రాసింది. బడ్జెట్ ప్రసంగాలు, అందులో పొందుపరచాల్సిన అంశాలపై మార్గదర్శకాలు ప్రకటించింది. కాగా, 2.30 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించగా.. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. కాగా, ప్రస్తుత బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తు్న్నట్లు సమాచారం. వ్యవసాయం పాడి పరిశ్రమపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇదిలాఉంటే.. 2019తో పోల్చుకుంటే రాబడులు భారీగా పెరిగాయి. గత బడ్జెట్‌లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపులు, ప్రస్తుతం బడ్జెట్‌లో చేసే కేటాయింపులపై సర్కార్ ప్రత్యేక దృష్టిసారించింది. కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను రెండు వారాలకు పైగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇదిలాఉంటే.. ఫిబ్రవరి చివరి వారంలోనే బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని తొలుత భావించింది ప్రభుత్వం. కానీ, ఇతర కారణాలతో మార్చి మొదటి వారం నుంచి ఈ సమావేశాల నిర్వహణను ఖరారు చేశారు.
Also read:
TS EAMCET 2022 Exam Date: తెలంగాణ ఎంసెట్ 2022 పరీక్ష జూన్‌లో.. ఈ సారి కొత్తగా..
Orvakal Fire Accident: రెండు రోజులైనా కనిపించని బాలిక ఆచూకీ.. ఇంకా కొనసాగుతూనే ఉన్న సహాయక చర్యలు..
Health Tips: ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా ? అయితే ప్రమాదమే అంటున్న నిపుణులు..