Telangana: గేర్ మార్చిన లోకేష్.. పెట్టుబడుల్లే లక్ష్యంగా అమెరికా టూర్.. సత్యనాదెళ్లతో భేటి..

| Edited By: Velpula Bharath Rao

Oct 29, 2024 | 10:58 AM

రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. లోకేష్ అమెరికా టూర్ అవిశ్రాంతంగా కొనసాగుతోంది. తాజాగా రెండ్ మండ్‌లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తో పాటు శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్‌తో భేటీ అయిన లోకేష్... ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతోందనీ, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులకు అన్నివిధాల అనుకూలమైన ప్రాంతమని చెప్పారు.

Telangana: గేర్ మార్చిన లోకేష్.. పెట్టుబడుల్లే లక్ష్యంగా అమెరికా టూర్.. సత్యనాదెళ్లతో భేటి..
Lokesh With Satya Nadella
Follow us on

ముందుగా సత్య నాదెళ్లతో జరిగిన సమావేశంలో క్లౌడ్-ఆధారిత ప్లాట్‌ఫామ్‌లను అమలు చేయడం, డేటా అనలిటిక్స్ కోసం ఏఐని ఉపయోగించడం, సైబర్‌ సెక్యూరిటీని మెరుగుపరచడం, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రో సాఫ్ట్ సహకారాన్ని అందించాలని లోకేష్ కోరారు. ఏఐ ప్రాజెక్టులకు అనువుగా ఉన్న అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా తయారు చేయాలని భావిస్తున్నామని, ఇందులో భాగంగా అమరావతిలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని లోకేష్ వివరించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, డైనమిక్ టెక్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాల్సిందిగా కోరారు. ఏపీలో నెలకొన్న మౌలిక సదుపాయాలు, సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఒకసారి మా రాష్ట్రానికి వచ్చి పరిశీలించమని కోరిన లోకేష్ ఏపిలో పెట్టుబడులకు గల అవకాశాలను పరిశోధించాలని, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి ప్రణాళికల్లో అధునాతన సాంకేతికను ఏకీకృతం చేయడానికి భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈఓను కోరారు.

లోకేష్‌తో భేటీ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ… మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా ఉందని చెప్పారు. అక్టోబర్ 2024 నాటికి మైక్రోసాఫ్ట్ $3.1 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్ కలిగి ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ దాని క్లౌడ్ సేవలు, ఏఐ -డ్రైవెన్ సొల్యూషన్‌ రంగంలో బలమైన వృద్ధితో $211.9 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిందని వివరించారు.అనంతరం శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ కంపెనీ సీఈవో శంతను నారాయణ్‌తో లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శంతను నారాయణన్ మాట్లాడుతూ… అడోబ్ కంపెనీ ప్రస్తుతం డిజిటల్ మీడియా, క్లౌడ్-ఆధారిత సేవల్లో అగ్రగామిగా ఉంది. ఫోటోషాప్, అక్రోబాట్, ఇల్లస్ట్రేటర్ వంటి సాధనాలను మరింత అందుబాటులోకి తెచ్చామని, సృజనాత్మకత, డాక్యుమెంట్ ఉత్పాదకత, ఏఐ-పవర్డ్ ఇన్నోవేషన్స్ రంగంలో ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ వెర్షన్స్ ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.