Andhra: ఆ రైతులు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. భారీ రాయితీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకంలో రైతులకు భారీ రాయితీలు ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ రైతులు, ఇతర రైతులు వేర్వేరు రాయితీలను పొందవచ్చు. మల్బరీ సాగు ఖర్చులు, షెడ్ల నిర్మాణం, స్టాండ్లు, వ్యవసాయ పరికరాలుకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. రైతులు RSKలో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ రాయితీలను పొందవచ్చు.

Andhra: ఆ రైతులు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. భారీ రాయితీ
Crop

Updated on: Oct 03, 2025 | 5:38 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పట్టు పరిశ్రమను పునరుద్ధరించేందుకు కీలక చర్యలు చేపడుతోంది. గతంలో నిర్లక్ష్యానికి గురైన ఈ రంగాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది. 2025–26 సంవత్సరానికి లక్ష్యాలను నిర్దేశిస్తూ, మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకంలో రైతులకు భారీ రాయితీలు అందిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మల్బరీ సాగులో ఎకరాకు ఖర్చు రూ. 30,000 గా ఉంటే, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ. 27,000 రాయితీ, ఇతర రైతులకు రూ. 22,500 రాయితీ లభిస్తుంది. రైతులు వీటిని వలన పంట ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

పట్టుపురుగుల పెంపకానికి అవసరమైన షెడ్ల నిర్మాణానికి రెండు రకాల షెడ్ల రాయితీలు ప్రకటించారు. షెడ్-1 అయితే ఒక్కో షెడ్డు ధర రూ. 4.50 లక్షలు; ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ. 4.05 లక్షలు; ఇతర రైతులకు రూ. 3,37,500 రాయితీ ఇస్తారు. షెడ్-2: ఒక్కో షెడ్డు ధర రూ. 3.25 లక్షలు; ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ. 2,92,500; ఇతర రైతులకు రూ. 2,43,750 రాయితీ లభిస్తుంది. ఒక్కో స్టాండ్ ధర రూ. 45,500, ఇందులో ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ. 40,950, ఇతర రైతులకు రూ. 34,125 రాయితీ లభిస్తుంది.

ప్రతి యూనిట్ వ్యవసాయ పరికరం ధర రూ. 1,00,000, ఇందులో ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ. 90,000, ఇతర రైతులకు రూ. 50,000 రాయితీ లభిస్తుంది. రైతులు ఈ రాయితీలను పొందడానికి RSKలో దరఖాస్తు చేసుకోవాలి. అదనపు సమాచారం కోసం గ్రామ పట్టు పరిశ్రమశాఖ సహాయ సిబ్బంది, రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు.

పట్టు పరిశ్రమలో రైతులకు ఆర్థిక మద్దతు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఇతర రైతులకు వేర్వేరు రాయితీలు ప్రకటించారు. మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకంలో పెట్టుబడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రైతులకు ఇది సువర్ణ అవకాశమని… పట్టు పరిశ్రమలో మున్ముందు అడుగులు వేయాలనుకునే వారు తక్షణం వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.