Andhra Pradesh: ఏపీలో ఆ గ్రామం కింద బయటపడ్డ ప్రాచీన నగరం.. చూస్తే వావ్ అంటారు..
ఒకప్పుడు పరిసర ప్రాంతాలను కూడా సరిగా తెలియని గ్రామం.. ఇపుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది... ఇపుడు ఆవూరికి చాలా ప్రాధాన్యత పెరిగింది.. ఐదేళ్ల క్రితం వరకు ఆ ఊరంటే పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల నుంచి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది

ఇప్పుడు ఈ గ్రామం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం.. ప్రాచీన నాగరికతకు ఆ గ్రామం వేదిక కావడం.. ఆ గ్రామం కింద ఓ ప్రాచీన నగరమే దాగి ఉండడం.. అలాంటి గ్రామానికి ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. మీరు చూసిన ఈ దృశ్యాల తాలూకు చరిత్ర వంద, రెండు వందల ఏళ్ళు కాదు.. రెండు వేల ఎల్లనాటి చరిత్ర తాలూకు ఆనవాళ్లు.. వేల ఏళ్లనాటి చారిత్రక విశేషాలు ఆ గ్రామం శిథిలాల కింద దాగి ఉన్నాయి. పురావస్తుశాఖ తవ్వేకొద్ది కొత్త కొత్త వింతలు, విశేషాలు బయటికొస్తున్నాయి. టెక్నాలజీ లేని రోజుల్లోనే అప్పట్లో కట్టిన అద్భుతమైన కట్టడాలు బయటపడ్డాయి.. రకరకాల వస్తువులు, నిర్మాణాలు బయటపడుతూ ఆనాటి పాలన తాలూకు విశేషాలను గుర్తుకు తెస్తున్నాయి. ఎంతగా అంటే తవ్వకాల్లో బయటపడిన, పడుతున్న అవశేషాలు చూసి పురావస్తు శాఖ కూడా విస్తుపోయేంత..
నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది గొట్టిప్రోలు గ్రామం. ఇది ఒక కుగ్రామం. ఈ గ్రామానికి కూతవేటు దూరంలో చారిత్రాత్మక బంకింగ్ హోమ్ కాలువ, మరికొంచెం దూరంలో బంగాళాఖాతం, దుగ్గరాజపట్నం ఓడరేవు, ఊరికి మరోపక్క స్వర్ణముఖి నది పాయ, దక్షిణ వైపున చెన్నై,నెల్లూరు హైవేలు ఉన్నాయి. గొట్టిప్రోలు లేదా గొట్టిపల్లిగా పిలవబడే ఈ గ్రామం ఓ ప్రశాంతమైన గ్రామం. సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. జిల్లావాసులకు ప్రజలకు పెద్దగా పరిచయం లేని గ్రామం. అయితే ప్రస్తుతం గొట్టిపల్లి గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. గూగుల్‌లో ఈ గ్రామం పేరు వెతికితే చాలు ఈ ఊరి గురించి, ఈ గ్రామంలోని మట్టి పొరలలో దాగివున్న వింతలు, ప్రాచీన విశేషాలు ఇట్టే తెలిసి పోతాయి. ఈ మాటే చెప్పి సంబరపడుతున్నారు గ్రామస్తులు.
ఈ ప్రాంతం ఎంతో ప్రాచీన చారిత్రక నేపథ్యం కలిగి ఉంది. ఈ ప్రాంతంలో రెండేళ్ల నుంచి పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు చేపట్టారు. ఇప్పటికీ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల తవ్వకాలు ఫలించి ఈ తవ్వకాల్లో శాతవాహనుల కాలానికి చెందిన ప్రాచీన చారిత్రక అవశేషాలు బయట పడుతున్నాయి. అప్పట్లో ప్రసిద్ధిగాంచిన ఓ పెద్ద కోట బయటపడింది. అందులో రకరకాల వస్తువులు, పనిముట్లు, నిర్మాణాలు, వసతులు, కట్టడాలను వెలికితీశారు పురావస్తు శాఖ అధికా రులు. ఈ ప్రాంతాన్ని కోటదిబ్బ అని కూడా పిలుస్తారు. అప్పట్లో ఈ కోటదిబ్బ ఎంతో ప్రాధాన్యత సంతరించు కున్న ప్రాంతంగా అక్కడ బయటపడిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. మరోవైపు ఈ గొట్టిప్రోలు కోట వేదికగా సముద్రనౌకా వాణిజ్య వ్యాపారం కూడా సాగి నట్లు చరిత్ర కారులు చెబుతున్నారు. సముద్ర మార్గం గుండా వర్తక వాణిజ్య వ్యాపారం సాగేందుకు ఈ కోట అనువుగా ఉండడంతో అప్పట్లో వర్తక వాణిజ్య కేంద్రం గా కూడా ఈ ప్రాంతం గుర్తింపు పొందినట్లు తెలుస్తోంది. ఈ గ్రామానికి.. ఇక్కడ ఉన్న కోట దిబ్బకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది.. అలాగే 24 ఎకరాల స్థలాన్ని పురావస్తు శాఖ కు అప్పగిస్తూ గెజిట్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం..
