కర్ణాటక రాష్ట్రం నుంచి తాడిపత్రికి ఐరన్ లోడుతో కంటైనర్ ట్రాలీ లారీతో డ్రైవర్ ఫరూక్ బయల్దేరాడు. రాత్రి సమయంలో అనంతపురం జిల్లా యాడికి మండలం రామన్న గుడిసెల దగ్గరకు వచ్చేసరికి చీకటి పడటంతో దారి తెలియక డ్రైవర్ ఫరూక్ గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకున్నాడు. ఇంకేముంది గూగుల్ మ్యాప్ గమ్యస్థానానికి చేరుస్తుంది కదా.. అనుకుని డ్రైవర్ ఫరూక్ గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ వెళ్ళాడు. ఎంత దూరం వెళ్లినా గమ్యస్థానం రావడం లేదు.. అదేవిధంగా మొత్తం కొండల్లోకి దారి చూపించింది గూగుల్ మ్యాప్… గుడ్డిగా గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని వెళ్లిన లారీ డ్రైవర్ ఫరూక్.. యాడికి మండలంలోని రామన్న గుడిసెల వద్ద కొండల్లోకి భారీ కంటైనర్ ఉన్న లారీని తీసుకెళ్లాడు. అలా చాలా దూరం కొండల్లోకి వెళ్లిన తర్వాత గాని దారి తప్పానని… గూగుల్ మ్యాప్ రూట్ తప్పుగా చూపించిందని అతను గ్రహించాడు. చేసేదేమీ లేక చీకట్లోనే కంటైనర్ లారీని వెనక్కి తిప్పుతుండగా కొండ లోయల్లోకి లారీ ఒరిగిపోయింది. లారీ లోయలోకి పడిపోతుందని గ్రహించిన డ్రైవర్ ఫరూక్ వెంటనే క్రిందకు దిగి… స్థానికులకు, పోలీసులకు సమాచార ఇచ్చాడు. లోయలోకి ఒరిగిపోయిన లారీని జెసిబిల సాయంతో స్థానికులు పైకి తీశారు. గూగుల్ మ్యాప్ ఎంత పని చేసింది అనుకున్న లారీ డ్రైవర్ ఫరూక్… కొంచెం ఉంటే ప్రాణాలు పోయే అనుకుని… ఊపిరి పీల్చుకున్నాడు. అందుకే గుడ్డి గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవ్వకుండా.. స్థానికంగా కనిపించిన వారితో ఓ సారి క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి