Anantapur Fire Accident: అనంతపురంలో అడవికి నిప్పు రాజుకుంది. మంటలు భారీగా వ్యాపించాయి. చీనీ తోట ను చుట్టుముట్టాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. వివరాల్లోకెళితే.. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లి వద్ద ఓబులేసు కొండకు దుండగులు నిప్పు పెట్టారు. దీంతో అగ్నికి కొండ ఆహుతి అయింది. అగ్నికీలలు చుట్టుపక్కల ప్రాంతాలకు పెద్ద ఎత్తున వ్యాపించి అందులో ఉన్న మొక్కలు, చెట్లు కాలి బూడిద అయ్యాయి. కొండకు కింది పక్కన బుక్కపట్నం గ్రామానికి చెందిన పత్తి చలపతి రైతుకు చెందిన చీనీ తోట కు మంటలు వ్యాపించాయి. దీంతో కంచ పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అగ్ని కీలలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. సత్వరమే అక్కడికి చేరుకొని చీనీ తోట అగ్నికి ఆహుతి కాకుండా మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పటికే కొంతమేర పంట దగ్దమయ్యింది. రూ. 5 లక్షల మేర రైతుకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కాగా, మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Also read:
TTD: తిరుచానూరులో శ్రీయాగానికి అంకురార్పణ.. ఈ ఏడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు..
Coronavirus: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడిని బలి తీసుకున్న కరోనా….