Andhra Pradesh: భార్య.. భర్త మధ్యలో ఓ ‘కత్తి’గాడు.. వేట కొడవలితో తిరుగుతున్న వ్యక్తిని ఆపగా..

| Edited By: Shaik Madar Saheb

Feb 05, 2024 | 9:14 PM

పెళ్లయింది.. అంతా బాగానే ఉంది.. ఈ క్రమంలోనే భార్య మనసు మారింది.. ఫెస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమాయణం కొనసాగించింది.. అతని కోసం ఉంటున్న ఊరినే మారేలా చేసింది.. అక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరిగింది.. చివరకు.. తన అనైతిక బంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తను కడతేర్చేందుకు ప్లాన్ రచించింది.. క్రైమ్ సినిమా స్టోరీని మించే ప్లాన్ .. చివరకు ఓ కత్తితో బయటపడింది..

Andhra Pradesh: భార్య.. భర్త మధ్యలో ఓ ‘కత్తి’గాడు.. వేట కొడవలితో తిరుగుతున్న వ్యక్తిని ఆపగా..
Crime News
Follow us on

పెళ్లయింది.. అంతా బాగానే ఉంది.. ఈ క్రమంలోనే భార్య మనసు మారింది.. ఫెస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమాయణం కొనసాగించింది.. అతని కోసం ఉంటున్న ఊరినే మారేలా చేసింది.. అక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరిగింది.. చివరకు.. తన అనైతిక బంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తను కడతేర్చేందుకు ప్లాన్ రచించింది.. క్రైమ్ సినిమా స్టోరీని మించే ప్లాన్ .. చివరకు ఓ కత్తితో బయటపడింది.. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే హత్య చేయించాలనుకుంది భార్య.. భర్తను హత్య చేసేందుకు వేట కొడవలి పట్టుకొని తిరుగుతున్న ప్రియుడిని తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేసి.. హత్య కుట్రను భగ్నం చేశారు. తాడిపత్రి ఆర్.డి.టి.కాలనిలో హత్య కుట్రను భగ్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఉరవకొండకు చెందిన నాగరాజుకు అదే ప్రాంతానికి చెందిన మహిళకు పెళ్లయింది.. ఈ క్రమంలో నాగరాజు భార్య ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో కొన్ని రోజులుగా ప్రేమాయణం కొనసాగిస్తోంది. తాడిపత్రిలోని ఆర్డిటి కాలనీకి చెందిన భాస్కర్ మాయలో పడిన వివాహిత.. భర్త నాగరాజు తీసుకుని ఉరవకొండ నుంచి తాడిపత్రికి కాపురం మార్చింది. అనంతరం భర్త నాగరాజుకి ప్రియుడు భాస్కర్ ను పరిచయం చేసింది. అయితే తన భార్య ప్రియుడు భాస్కర్‌తో చనువుగా, సన్నిహితంగా ఉండటాన్ని భర్త నాగరాజు చూశాడు. అప్పటినుంచి భర్త నాగరాజుకు.. ప్రియుడు భాస్కర్ కు మధ్య గొడవలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో నాగరాజు భార్య ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించుకోవాలని పక్కా ప్లాన్ వేశారు. భార్య వేట కొడవలితో భర్త నాగరాజును చంపేందుకు ప్రియుడు భాస్కర్ ను ఉసిగొలిపింది. ఆమె మాటలు విన్న ప్రియుడు భాస్కర్.. వేట కొడవలి తీసుకుని ప్రియురాలి భర్త నాగరాజును చంపేందుకు తిరుగుతుండడంతో.. అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని ఆపారు.. అనంతరం తమదైన శైలిలో విచారించగా.. హత్య కుట్ర కోణం బయటపడింది. దీంతో పోలీసులు ప్రియుడు భాస్కర్ ను అదుపులోకి తీసుకొని వేట కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

వీడియో..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..