
కడుపున పుట్టిన పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లిదండ్రుల తల్లడిల్లిపోతారు. అలాంటిది ఈ మధ్య కాలంలో ఆ తల్లిదండ్రులే చిన్నారుల పాలిట యములుగా మారుతున్నారు. పుట్టినప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు రాగానే.. ఆ కోపాన్ని పిల్లనపై చూపిచడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా అలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. భార్యపై అనుమానంతో ఓ కిరాతకుడు అభంశుభం తెలియని చిన్నారులను కడుపున పెట్టుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేలమకులు గ్రామానికి చెందిన కల్లప్ప అనే వ్యక్తి భార్య, సింధు (11), అనసూయ (9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా భార్య తీరుపై కల్లప్ప అనుమానం పెంచుకున్నాడు. దీంతో భార్యతో వివాదం నేపథ్యంలో తండ్రి కల్లప్ప ఇద్దరి పిల్లలను తీసుకొని కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం సమీపంలోని హెచ్.ఎల్.సి కాలువ దగ్గరికి తీసుకెళ్లాడు. మొదట పెద్ద కుమార్తె సింధును కాలువలోకి నెట్టాడు. అది చూసి భయపడిపోయిన చిన్న కూతురు పరిగెత్తేందుకు ప్రయత్నించగా.. వెంటపడీ మరీ.. చిన్నారిని నీటిలో విసిరేశాడు. అనంతరం ఏమి ఎరగనట్టు ఇంటికి వెళ్లాడు.
అయితే ఇంట్లో కూతుళ్లు కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లి, గ్రామస్తులు తండ్రి కల్లప్పను నిలదీశారు. దీంతో కల్లప్ప తానే ఇద్దరు పిల్లల్ని నీటిలో తోసి చంపేసినట్టు తెలిపాడు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కల్లప్పను అదుపులోకి తీసుకొని.. అతడితో పాటు కాలువ దగ్గరకు వెళ్లారు. అక్కడ ఒక చిన్నారి మృతదేహాన్ని వెలికి తీయగా.. మరో చిన్నారి మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.
అయితే ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టావని కల్లప్పను ప్రశ్నించగా.. కేవలం భార్యపై అనుమానంతోనే తన ఇద్దరు కుమార్తెలను నీళ్లలోకి తోసి చంపానని కల్లప్ప ఒప్పుకున్నాడు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కల్లప్పను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.