Anantapur District: సీఐకి హిజ్రాల సన్మానం.. రీజన్ తెలిస్తే మీరు కూడా ఆయనకు సెల్యూట్ చేస్తారు

|

Sep 30, 2021 | 12:49 PM

ఎన్నో కష్టాలు పడి సంపాదించుకున్న డబ్బు. అర్థరాత్రి దొంగలు దోచుకెళ్లిపోయారు. రేపట్నుంచి ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో...

Anantapur District: సీఐకి హిజ్రాల సన్మానం.. రీజన్ తెలిస్తే మీరు కూడా ఆయనకు సెల్యూట్ చేస్తారు
Uravakonda Ci Sekhar
Follow us on

ఎన్నో కష్టాలు పడి సంపాదించుకున్న డబ్బు. అర్థరాత్రి దొంగలు దోచుకెళ్లిపోయారు. రేపట్నుంచి ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితి. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా ఆ సొత్తు తిరిగి దొరుకుతుందన్న నమ్మకం లేదు. ఏదో నామ్ కే వాస్త్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. దొంగలను పట్టుకుని సొత్తుని రికవరీ చేశారు. దీంతో బాధితులు దర్యాప్తు వేగంగా జరిగిన పోలీసు అధికారికి సన్మానం చేశారు. ఆయనపై పూల వర్షం కురిపించారు. ఇంతకీ దొంగతనం జరిగింది ఎక్కడో తెలుసా.. ఓ హిజ్రా ఇంట్లో.

వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా విడపనకల్ గ్రామానికి చెందిన హిజ్రా అనుష్క అలియాస్ హనుమప్ప ఇంట్లో ఆగస్టు 31వ తేదీ రాత్రి దొంగతనం జరిగింది. తాళం పగలగొట్టి ఇంట్లోకి ఎంటరైన దొంగలు.. బీరువా, గూట్లో దాచి ఉంచిన 6.5 తులాల బంగారు నగలు, 4 లక్షల రూపాయల డబ్బు దోచుకెళ్లారు. దాచుకున్నదంతా దొంగలు దోచుకెళ్లడంతో అనుష్క ఎంతో దిగులు చెందింది. ఇక తన సొమ్ము తిరిగి రాదేమోనని కన్నీటిపర్యంతమైంది.  కానీ ఎందుకైనా మంచిదని పోలీసులకు కంప్లైంట్ చేసింది. రంగంలోకి దిగిన ఉరవకొండ సీఐ శేఖర్ కేసును స్వయంగా పర్యవేక్షించారు. టెక్నాలజీ సాయంతో దొంగలను పట్టుకున్నారు. దొంగల నుంచి రూ.4 లక్షల రూపాయల నగదు, బంగారాన్ని రికవరీ చేశారు. ఇక తనకు దక్కదనుకున్న సొమ్ము తిరిగి రావడంతో అనుష్క, ఇతర హిజ్రాలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. కృతజ్ఞతగా హిజ్రాల సంఘం సభ్యులు ఉరవకొండ C.I శేఖర్‌ను సర్కిల్ ఆఫీసులో ఘనంగా సన్మానించారు. సీఐపై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

 

Also Read: ఈ ఫోటోలో ఉంది నటుడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కుర్రకారు మెచ్చే నటి.. గుర్తుపట్టండి

తూర్పుగోదావరి జిల్లాలో మెగా బ్రదర్స్ పర్యటనలు.. భారీ ఏర్పాట్లు చేస్తోన్న ఫ్యాన్స్