ముఖానికి మాస్క్, మెడలో కండువా, రబ్బర్ చెప్పులు.. ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ.. ఇంతకీ ఎవరతను?
అనంతపురం జిల్లాలో అనుహ్యా ఘటన చోటు చేసుకుంది. గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో సిసి ఫుటేజ్ చూసి ఆసుపత్రి సిబ్బంది అవాక్కయ్యారు. అసలా సీసీ ఫుటేజ్ లో ఏముంది. సీసీ ఫుటేజ్ లో సిబ్బంది ఏం చూశారా? అనుకుంటున్నారా? స్వయంగా జిల్లా కలెక్టర్ అర్ధరాత్రి ఆసుపత్రిలో తనిఖీ చేశారు.

అనంతపురం జిల్లాలో అనుహ్యా ఘటన చోటు చేసుకుంది. గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో సిసి ఫుటేజ్ చూసి ఆసుపత్రి సిబ్బంది అవాక్కయ్యారు. అసలా సీసీ ఫుటేజ్ లో ఏముంది. సీసీ ఫుటేజ్ లో సిబ్బంది ఏం చూశారా? అనుకుంటున్నారా? స్వయంగా జిల్లా కలెక్టర్ అర్ధరాత్రి ఆసుపత్రిలో తనిఖీ చేశారు. ఈ విషయం సిసి ఫుటేజ్ లో చూసి, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో హాజరయ్యేందుకు మే నెల 28వ తేదీన గుంతకల్ వచ్చారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రొటీన్‌గా వెళ్తే ఏముంటుంది అనుకున్నారో ఏమో? జిల్లా కలెక్టర్ మారువేషంలో వెళ్లారు. ముఖానికి మాస్క్.. మెడలో కండువా కప్పుకుని గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కలియతిరిగారు. రోగులను అడిగి ఆసుపత్రిలో సౌకర్యాలు, సమస్యలను తెలుసుకున్నారు.
సామాన్యుడిలా ముఖానికి మాస్క్, మెడలో కండువా కప్పుకుని, రబ్బర్ చెప్పులు ఆసుపత్రి బయటే విడిచి లోపలికి వచ్చారు. ఆసుపత్రులో సిబ్బందితో మాట్లాడుతున్నా.. ఎవరు గుర్తుపట్టలేదు. మరుసటి రోజు ఆసుపత్రి సిబ్బంది రొటీన్‌గా సీసీ ఫుటేజ్ పరిశీలిస్తుంటే, రాత్రి 10 గంటల తర్వాత జిల్లా కలెక్టర్ వచ్చి వెళ్ళిన సంగతి తెలుసుకుని ఖంగుతిన్నారు. సీసీ ఫుటేజ్ చూసే వరకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి తనిఖీ చేసిన విషయం ఆసుపత్రి సిబ్బందికి తెలియదు.
దీంతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మరుసటి రోజు ఉరుకులు, పరుగులు పెట్టారు. ఇంతకీ కలెక్టర్ గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో ఏం పరిశీలించారు? రోగులు ఏ సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు? అన్న దానిపై గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆరా తీస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
