Anandayya Responds to Rumors : ఆనందయ్య నాటు మందు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. కాగా మందుపై పూర్తి స్థాయి పరిశోధనలు చేసే వరకు పంపిణీని ఏపీ సర్కార్ నిలిపివేసింది. ఇదిలా ఉంటే ఆనందయ్యతో కొంతమంది ప్రైవేట్‌గా మందు తయారీ చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలను ఖండించిన ఆనందయ్య అసలు విషయాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు.
“రాజకీయాలకు అతీతంగా నేను మందు తయారుచేశా. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మందు పంపిణీ చేశా. నేను పోలీసుల సమక్షంలో ఎలాంటి మందు తయారు చేయలేదు. నాపై కొందరు అబాండాలు వేస్తున్నారు. నేను ప్రస్తుతం ఎక్కడా మందు తయారు చేయడంలేదు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే మందు తయారు చేసి.. ప్రజలందరికీ అందించేందుకు సిద్ధంగా ఉన్నా” అంటూ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే మందు కోసం డిమాండ్ పెరుగుతోంది. కృష్ణపట్నంలో ఆనందయ్య మందును పూర్తిగా నిర్ధారించిన తరువాత మాత్రమే.. తయారీకి పర్మిషన్ వస్తుంది. నియమ, నిబంధనలతో పాటు వాస్తవ పరిస్థితుల ప్రతిపాదికన గవర్నమెంట్ ఓ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో సోషల్ మీడియాలో ఆనందయ్య మందుపై విభిన్న కోణాల్లో వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. ఎందులో వాస్తవికత దాగి ఉందో, ఎందులో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఆనందయ్య మందు.. నాటు మందు అని, ఆయుర్వేదం కాదని.. ఆయుష్ కమిషనర్ రాములు మౌఖికంగా ధ్రువీకరించారు. అదే క్రమంలో ఆరోగ్యానికి హానీ లేదని చెప్తున్నారు.