ఆనందయ్య నాటు మందు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. కాగా మందుపై పూర్తి స్థాయి పరిశోధనలు చేసే వరకు పంపిణీని ఏపీ సర్కార్ నిలిపివేసింది. ఈ నాటు మందుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కృష్ణపట్నం ఆనందయ్య స్పందించారు. తన మందుకు ఇంకా అనుమతులు రాలేదని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. మందు తయారీకి అవసరమైన ఆకులు, దినుసులు ప్రస్తుతం రెడీగా లేవని వివరించారు. ఎవరూ వదంతులు నమ్మి కృష్ణపట్నం గ్రామానికి రావొద్దని కొరారు. మరోవైపు ఆనందయ్య నాటు మందుపై ఆయుష్ భిన్న కోణాల్లో పరిశీలినలు జరుపుతోంది. ఆయుర్వేద వైద్య విభాగంలో ఆనందయ్య.. వైద్యుడిగా నమోదైతే తప్ప ఇటువంటి వైద్య ప్రక్రియ, మందుల తయారీకి ఆయుష్ అనుమతులు మంజూరు చేయదు. ఇప్పుడు అలాంటి ఓ పరిస్థితిని ఆనందయ్య ఎదుర్కొంటున్నాడు.
ఇదిలా ఉంటే మందు కోసం డిమాండ్ పెరుగుతోంది. కృష్ణపట్నంలో ఆనందయ్య మందును పూర్తిగా నిర్ధారించిన తరువాత మాత్రమే.. తయారీకి పర్మిషన్ వస్తుంది. నియమ, నిబంధనలతో పాటు వాస్తవ పరిస్థితుల ప్రతిపాదికన గవర్నమెంట్ ఓ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో సోషల్ మీడియాలో ఆనందయ్య మందుపై విభిన్న కోణాల్లో వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. ఎందులో వాస్తవికత దాగి ఉందో, ఎందులో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఆనందయ్య మందు.. నాటు మందు అని, ఆయుర్వేదం కాదని.. ఆయుష్ కమిషనర్ రాములు మౌఖికంగా ధ్రువీకరించారు. అదే క్రమంలో ఆరోగ్యానికి హానీ లేదని చెప్తున్నారు. మరో 2,3 రోజుల్లో పంపిణీ సహా ఇతర విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read: ఏపీలో మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు.. నేడు లేదా రేపు సర్కార్ ఉత్తర్వులు !