Andhra Pradesh: ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే.. భర్తకు ప్రియురాలితో పెళ్లి ఘటనలో ఊహించని ట్విస్ట్

|

Sep 27, 2022 | 7:40 PM

భార్య భర్త ప్రియురాలు.. టిక్ టాక్ తో ఏర్పడిన పరిచయం ఆ ముగ్గురినీ ఒకటి చేసింది. భర్తకు దగ్గరుండి ప్రియురాలితో పెళ్లి చేసిన ఓ మహిళ. ఈ ఘటన అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది...

Andhra Pradesh: ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే.. భర్తకు ప్రియురాలితో పెళ్లి ఘటనలో ఊహించని ట్విస్ట్
Marriage
Follow us on

భార్య భర్త ప్రియురాలు.. టిక్ టాక్ తో ఏర్పడిన పరిచయం ఆ ముగ్గురినీ ఒకటి చేసింది. భర్తకు దగ్గరుండి ప్రియురాలితో పెళ్లి చేసిన ఓ మహిళ. ఈ ఘటన అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అయితే.. టిక్ టాక్ లో పరిచయం అయిన యువతితో భర్తకు పెళ్లి చేసిన భార్య ఘటనలో కొత్త ట్విస్ట్ తెర పైకి వచ్చింది. తనకు, తన భర్తకు జరిగిన పెళ్లిలో మొదటి భార్య గా చెప్తున్న విమల అనే మహిళకు ఎలాంటి సంబంధం లేదని నిత్యశ్రీ చెప్పడం ఆసక్తికరంగా మారింది. పెళ్లి జరిగిన తర్వాత పెళ్లి కుమారుడు కల్యాణ్ కనబడకుండా వెళ్లిపోయాడు. మొదటి భార్యను నేనే, మొదటి ప్రేమికురాలిని నేనే అంటూ నిత్యశ్రీ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తనకు తన భర్తకు పెద్దల సమక్షంలో పెళ్లి చేశారని, తన మొదటి భర్త అని చెప్పుకునే విమలకు ఇది వరకే రెండు పెళ్లిళ్లు జరిగాయని రహస్యాన్ని వెల్లడించింది. తన భర్తకు మాయమాటలు చెప్పి విమల కల్యాణ్ ను తీసుకువెళ్లిందని, వారం రోజులు భర్త కళ్యాణ్ కోసం వేచి చూస్తానని చెప్పింది. అప్పటికి కల్యాణ్ రాకపోతే పోలీసులను ఆశ్రయిస్తానని కన్నీటిపర్యంతమైంది.

టిక్ టాక్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చకున్న నిత్య శ్రీ కి విశాఖపట్నానికి చెందిన కల్యాణ్ తో పరిచయం ఏర్పడి, ప్రేమకు దారి తీసింది. కొన్నాళ్లు ఇద్దరూ సన్నిహితంగానే ఉన్నారు. తర్వాత వివిధ కారణాలతో దూరమయ్యారు. అదే సమయంలో మరో యువతి (విమల)తో సదరు యువకుడికి పరిచయం అయ్యింది. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. విషయం తెలుసుకున్న నిత్య నేరుగా తిరుపతిలో వీరు ఉంటున్న ఇంటికి వచ్చింది. కల్యాణ్ ను ప్రేమించానని, అతనిని విడిచి ఉండలేనని చెప్పింది. ఆ యువకుడి భార్యతో మాట్లాడింది. తానూ ఇక్కడే ఉంటానని, అందరూ కలిసి ఉందామని నచ్చజెప్పింది. ముందు ఆమె మాటలను వ్యతిరేకించిన భార్య.. తన భర్తపై ఆమెకు ఉన్న ప్రేమను చూసి ఒప్పుకుంది. తన భర్తకు ఆ యువతితో పెళ్లి చేసింది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

Husband Marriage

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం చూడండి..