కోతుల బెడదతో చాలా ప్రాంతాల్లో జనం బెంబేలెత్తిపోతున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా వానర సమూహాలు వాటికి కనిపించిన వస్తువులను నాశనం చేస్తూ స్థానికులకు అపార నష్టం కలిగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వాటి అల్లరికి అడ్డే లేకుండా పోతుంది. గతంలో అడవులలో ఉంటూ అప్పుడప్పుడు బయటకు వచ్చి పంట పొలాలపై దాడులు చేసే కోతులు.. ఇప్పుడు నివాస గృహాల మధ్య జీవనానికి అలవాటు పడి అడవుల్లోకి వెళ్లడమే మానేశాయి. వాటిని జనావాసాల్లోంచి నుంచి పారద్రోలాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలు విఫలమే అయ్యాయి.
అయితే ప్రస్తుతం ఓ ప్రాంతంలో ఇప్పుడు కోతుల బెడదకు చక్కని పరిష్కారం ఆలోచించారు అక్కడి అధికారులు. వారి ఆలోచనను అమలు చేస్తూ ఆ ప్రాంతంలో కోతులు బెడద లేకుండా చేయడంలో విజయం సాధించారు. దాంతో అక్కడ చేసినట్లుగానే కోతుల బెడద ఉన్న ప్రాంతాల్లో అలాంటి చర్యలు చేపట్టేలా పలువురు అధికారులు వారి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. మొన్నటివరకు కోతుల బెడతతో బాధపడి ప్రస్తుతం వాటి నుంచి ఉపశమనం పొందిన ఆ ప్రాంతం ఎక్కడ ఉంది… వాటిని ఎలా పారద్రోలారు అనే విషయాలు తెలుసుకోవాలని ఉందా… అయితే ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణానికి ఎంతో చరిత్ర ఉంది. గత కొంతకాలంగా నూజివీడు వాసులకు కోతుల బెడదతో కంటిమీద కునుకు లేకుండా పోయింది. వందల సంఖ్యలో కోతులు గుంపులుగా జనావాసాల్లో తిరుగుతూ కంటికి కనిపించిన ప్రతి వస్తువును నాశనం చేస్తూ, వాటి చేష్టలను ప్రతిఘటించిన వారిపై దాడులకు తెగబడుతున్నాయి. ఇప్పటికే పలువురు కోతుల దాడిలో గాయాలై ఆసుపత్రి పాలయ్యారు. దాంతో మున్సిపల్ సమావేశాలు జరిగినప్పుడు అధికారులకు కౌన్సిలర్లు కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని, అక్రమంలోనే వాటికి హాని చేయకుండా జనావాసాల్లోంచి నుంచి అటవీ ప్రాంతాల్లోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేశారు.
దాంతో అధికారులు కోతుల సమస్య పరిష్కారం అయ్యే విధంగా చక్కని ఆలోచన చేశారు. కోతుల్ని తరిమేందుకు ఇద్దరు వ్యక్తులకు ఎలుగుబంటి వేషధారణ వేసి కోతులు ఎక్కువగా సంచరించే జనావాస ప్రాంతాల్లో వారిని ఉంచారు. కోతులు ఎలుగుబంటి వేషధారణలో ఉన్న వ్యక్తులను చూచి వాటికి హాని చేయడానికి చూస్తున్నారనే భయంతో ఆక్కడి నుంచి పరుగులు తీశాయి. అంతేకాక ప్రాంతం దరిదాపుల్లోకి సైతం వచ్చేందుకు సాహసం చేయడం లేదు. కొన్ని వానర సమూహాలు ఇప్పటికే భయపడి చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లోకి వెళ్లిపోయాయి. ఈ వినూత్న ఆలోచన సత్ఫలితాలు ఇవ్వడంతో ప్రజలు అధికారులను అభినందిస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…