Kurnool: చున్నీ వేసుకోలేదని పీఈటీ పైశాచికం.. విద్యార్థిని చెంపపై ఇనుప కడ్డీతో వాతలు..

|

Dec 19, 2022 | 6:21 PM

బానకచెర్ల గ్రామానికి చెందిన కీర్తి అనే బాలిక పదో తరగతి చదువుతోంది. అయితే.. ఆమె చున్నీ వేసుకోలేదనే కారణంతో పీఈటీ ఆమెను ఆడుకోనివ్వలేదు. అంతటితో ఆగకుండా కడ్డీని వేడిచేసి బాలిక చెంపపై కాల్చి వాత పెట్టింది.

Kurnool: చున్నీ వేసుకోలేదని పీఈటీ పైశాచికం.. విద్యార్థిని చెంపపై ఇనుప కడ్డీతో వాతలు..
School Girl In Andhra Prade
Follow us on

చిన్నారులపై ఉపాధ్యాయులు, ఆయాలు దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో వరసగా చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులకు అండగా ఉండి.. వారి సందేహాలు తీర్చాల్సిన వారే అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అల్లరి చేస్తున్నారని, చెప్పిన మాట వినడం లేదని, మార్కులు తక్కువగా వచ్చాయని, సరిగ్గా చదవడం లేదని.. ఇలా కారణం ఏదైనా కావచ్చ పిల్లలపై తమ పైశాచికాన్ని ప్రదర్శించడానికి. విశాఖపట్నంలో చిన్నారి బుగ్గపై అగ్గిపుల్లతో వాతలు పెట్టిన ఘటనను మరవకముందే ఇప్పుడు కర్నూలు జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. కొత్తపల్లిలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పాములపాడు మండలం బానకచెర్ల గ్రామానికి చెందిన కీర్తి అనే బాలిక పదో తరగతి చదువుతోంది. అయితే.. ఆమె చున్నీ వేసుకోలేదనే కారణంతో పీఈటీ ఆమెను ఆడుకోనివ్వలేదు. అంతటితో ఆగకుండా కడ్డీని వేడిచేసి బాలిక చెంపపై కాల్చి వాత పెట్టింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్ కు చేరుకున్నారు. ఘటనకు కారణమైన టీచర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గతంలోనూ విశాఖపట్నంలో ఇలాంటి ఘటనే జరిగింది. సీతంపేట కనకమ్మవారి వీధిలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వారి కుమార్తె రోజూ అంగన్ వాడీకి వెళ్తుండేది. ఈ క్రమంలో బుధవారం ఉదయం రోజూవారి మాదిరిగా అంగన్ వాడీకి వెళ్లిన చిన్నారిపై ఆయా.. అమానుషంగా ప్రవర్తించింది. పిల్లలకు ఆటలు, పాటలు నేర్పుతున్న సమయంలో ఆ బాలిక అల్లరి చేస్తుందని కోపం తెచ్చుకుంది ఆయా. దీంతో ముందు వెనకా ఆలోచించకుండా అగ్గిపుల్ల వెలిగించి ముఖంపై చురకలు అంటించింది.

అయితే.. చిన్నారుల పై జరుగుతున్న ఈ వరస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్నారులన్నాక అల్లరి చేయడం సహజం. అయితే వారి అల్లరినే భరించలేమనే కారణంతో కొందరు సహనం కోల్పోతున్నారు. ఇలాంటి పైశాచికత్వానికి పాల్పడుతున్నారు. ఈ ఘటనలతో ప్రజలు మండిపడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..