
ఆయన కలెక్టర్.. రైతుగా మారి కుమారుడికి సాగు విధానలను నేర్పించారు.. ఇప్పుడు లెక్టరేట్‌లో ఉద్యోగుల కోసం ఫ్యామిలీ డే ఏర్పాటు చేశారు. అంబెడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌లోని ఉద్యోగుల కోసం ఫ్యామిలీ డే విధానాన్ని ప్రారంభించారు కలెక్టర్ హిమాన్షు శుక్లా.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పని ఒత్తిడిని అధిగమించి మానసిక ఉల్లాసం పొందడంతో పాటుగా ఉద్యోగుల కుటుంబ సభ్యులకు పని సంస్కృ తిని, పనిచేసే వాతావరణం తెలుసు కునేందుకు వీలుగా ఫ్యామిలీ డే ఏర్పాటు చేశారు. కార్పొరేట్ సంస్థల శైలిలో ఫ్యామిలీ డే నూతన ఒరవడికి నాంది పలికారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా.
అంబెడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో ఫ్యామిలీ డే నిర్వహించిన కలెక్టర్.. ఫ్యామిలీ డే విధానం వల్ల ఉద్యోగులు ఒకరోజు కుటుంబ సభ్యులతో ఉద్యోగ విధులు నిర్వర్తించడం కుటుంబ సభ్యులకు ఉద్యోగుల పని వాతావరణం తెలుసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు కలెక్టర్ హిమాన్షు శుక్లా..
నెలలో ఒకరోజు ఫ్యామిలీ డే గా నిర్ణయించి ఆ రోజు ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులను వారి పని చేసే కార్యాలయాలకు తీసుకురావచ్చున్న కలెక్టర్. ఈ విధానంతో భార్య లేదా భర్త ఏమేమి విధులు నిర్వర్తిస్తున్నారు వారు ఎందుకు ఆలస్యంగా ఇంటికి వస్తున్నారు ఎవరెవరితో కలిసి విధులు నిర్వహిస్తున్నారో తెలుసుకోవచ్చన్నారు కలెక్టర్ హిమాన్షు శుక్లా..
నెలలో మూడో శనివారం ఫ్యామిలీ డే నిర్వహించాలనే యోచన చేస్తున్నామన్నారు అంబెడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం