Ambati Rambabu: ఏపీలో ఉగాది నుంచి కొత్త జిల్లాల పరిపాలన.. చంద్రబాబుపై అంబటి ఘాటైన వ్యాఖ్యలు

|

Mar 26, 2022 | 5:59 PM

Ambati Rambabu: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉగాది నుంచి ఏపీలో కొత్త జిల్లాలు ఉంటాయని, ఆ రోజు నుంచే పరిపాలన ప్రారంభం అవుతుందని వైఎస్సార్‌ సీపీ (YSRCP) అధికార..

Ambati Rambabu: ఏపీలో ఉగాది నుంచి కొత్త జిల్లాల పరిపాలన.. చంద్రబాబుపై అంబటి ఘాటైన వ్యాఖ్యలు
Ambati Rambabu
Follow us on

Ambati Rambabu: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉగాది నుంచి ఏపీలో కొత్త జిల్లాలు ఉంటాయని, ఆ రోజు నుంచే పరిపాలన ప్రారంభం అవుతుందని వైఎస్సార్‌ సీపీ (YSRCP) అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..40 ఏళ్ల టీడీపీ చరిత్రతో పాటు 34 నెలల జగన్‌ పరిపాలనపై చర్చ జరగాలని అన్నారు. చంద్రబాబు (Chandrababu) వ్యవస్థలను నాశనం చేసిన విధానాలపై చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు టీడీపీ (TDP) హయాంలో జరిగిన అన్యాయంపై చర్చ జరగాలన్నారు. ఈనెల 29 నుంచి చంద్రబాబు అరాచకాలను వివరిస్తామని, చంద్రబాబు ఒక్క పరిపాలనా సంస్కరణ అయినా చేశారా..? అని అంబాటి ప్రశ్నించారు.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం వికేంద్రీకరణ జరుగుతుంటే, చంద్రబాబు మాత్రం అమరావతే అభివృద్ధి కావాలంటున్నారని దుయ్యబట్టారు. తన ఎన్నికల మేనిఫెస్టోను మాయం చేసిన చరిత్ర టీడీపీదేనని ఆరోపించారు. ఇంటింటికీ మేనిఫెస్టోను పంచిన ఘనత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీదన్నారు. ఇక సాధారణ మరణాలను సారా మరణాలంటూ టీడీపీ రాద్ధాంతం చేస్తోందని, ఎన్టీఆర్‌ మధ్య నిషేధం తెస్తే చంద్రబాబు దాన్ని ఎత్తేశారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మద్యం విధానంపై కూడా చర్చ జరగాలన్నారు. ఎన్టీఆర్‌ను చంపి పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబని, వ్యవస్థలను భ్రష్టుపట్టించిన చరిత్ర చంద్రబాబుదన్నారు.

ఇవి కూడా చదవండి:

Raghu Rama Krishna Raju: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ చీఫ్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ

Tirumala: తిరుమలలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.. ఆరోజు శ్రీవారి బ్రేక్‌ దర్శనాలు రద్దు..