దేవినేని నోట అదే మాట

చంచల్ గూడ జైలుకా..? చర్లపల్లి జైలుకా..? ఏ జైలుకు వెళ్లాలో జగన్‌ తేల్చుకోవాలని దేవినేని ఉమా అన్నారు. తాము ఎక్కడికీ వెళ్లేది లేదని, మళ్లీ పాలించేది తెలుగుదేశం పార్టీనేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలను చూసి తట్టుకునేందుకు జగన్ సిద్ధంగా లేరని, ఫైనల్ పేమెంట్ తీసుకున్న ప్రశాంత్ కిశోర్ జగన్ చేతిలో సీఎం అనే ప్లేట్ పెట్టి వెళ్లాడని ఆయన విమర్శించారు. 11వ తేది సాయంత్రమే జగన్ తన ఓటమిని అంగీకరించారని ఆయన అన్నారు. […]

దేవినేని నోట అదే మాట

Edited By:

Updated on: Apr 17, 2019 | 11:56 AM

చంచల్ గూడ జైలుకా..? చర్లపల్లి జైలుకా..? ఏ జైలుకు వెళ్లాలో జగన్‌ తేల్చుకోవాలని దేవినేని ఉమా అన్నారు. తాము ఎక్కడికీ వెళ్లేది లేదని, మళ్లీ పాలించేది తెలుగుదేశం పార్టీనేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలను చూసి తట్టుకునేందుకు జగన్ సిద్ధంగా లేరని, ఫైనల్ పేమెంట్ తీసుకున్న ప్రశాంత్ కిశోర్ జగన్ చేతిలో సీఎం అనే ప్లేట్ పెట్టి వెళ్లాడని ఆయన విమర్శించారు. 11వ తేది సాయంత్రమే జగన్ తన ఓటమిని అంగీకరించారని ఆయన అన్నారు.

ఈ మేరకు బుధవారం మీడియాతో మాట్లాడిన దేవినేని.. కౌంటింగ్ వరకు క్యాడర్‌ను కాపాడుకునేందుకు జగన్ అనేక తంటాలు పడుతున్నారు. స్పీకర్‌పై దాడి చేసింది కాక గవర్నర్‌కు అన్నీ అబద్ధాలే చెప్పారు. చొక్కాలు చించుకునే సంస్కృతి జగన్‌దే. ఆయన మానసిక పరిస్థితి ప్రమాదకరంగా ఉంది అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని ఆయన జోస్యం చెప్పారు. హైదరాబాద్ భూభాగంలో దొంగలు దొంగలు కలిసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆయన దుయ్యబట్టారు.