సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందాల్సిందే: జగన్ ఆదేశం

ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందాల్సిందే: జగన్ ఆదేశం

Edited By:

Updated on: Jul 10, 2020 | 5:07 PM

ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంకా లబ్ధి పొందాల్సిన వారికి త్వరగా సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా ఏపీ ప్రభుత్వం గత నెలలో వైఎస్సార్​ వాహన మిత్ర, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, కాపు నేస్తం పథకాలను ప్రారంభించింది. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు నెల రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. ఈ క్రమంలో లబ్ది పొందాల్సిన వారు ఇంకా ఉండటంతో.. వారికి పథకాలను వర్తింపజేయాలని​ జగన్​ అధికారులకు సూచించారు. గతేడాది డిసెంబర్​ తరువాత మగ్గాలు ఏర్పాటు చేసుకున్న వారికి కూడా నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేయాలని సీఎం ఆదేశించారు.