వారందరికి నూటికి నూరు శాతం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాల్సిందే: సీఎం జగన్

| Edited By:

Jun 23, 2020 | 3:19 PM

లబ్ధిదారులకు నూటికి నూరు శాతం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇళ్ల పట్టాల కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన జగన్..

వారందరికి నూటికి నూరు శాతం ఇళ్ల పట్టాలు పంపిణీ  చేయాల్సిందే: సీఎం జగన్
Follow us on

లబ్ధిదారులకు నూటికి నూరు శాతం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇళ్ల పట్టాల కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన జగన్.. జూలై 8న ఇళ్లపట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమమని..  29–30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని ఆయన వెల్లడించారు. వాటికి సంబంధించి భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధి మీద అధికారులు నిశితంగా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఫ్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలని.. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల తుది జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి అని ఆయన అధికారులకు సూచించారు. కరోనా‌ పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత గ్రామాల్లో పర్యటిస్తానని.. ఆ సమయంలో ఇంటిపట్టా లేదని ఎవ్వరూ చేయి ఎత్తకూడదని జగన్ అన్నారు.

పారదర్శకంగా, ప్రభావవంతంగా ఇళ్లపట్టాలను పంపిణీ చేయాలని.. సరైన కారణంగా లేకుండా ఎవరికైనా ఇంటి పట్టా ఇవ్వలేదన్న సమాచారం తనకు తెలిస్తే దానికి అధికారులను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. ఇక గ్రామ సచివాలయాల ద్వారా పెన్షన్‌ కార్డు 10 రోజుల్లో, రేషన్‌ కార్డు 10 రోజుల్లో, ఆరోగ్యశ్రీ కార్డు 20 రోజుల్లో, ఇంటి పట్టా 90 రోజుల్లో అందాలని అన్నారు. అలా వ్యవస్థలను తయారుచేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని జగన్ వివరించారు.

Read This Story Also: మరో దుమారం రేపిన నిమ్మగడ్డ.. సుజనా, కామినేనితో భేటీ.. కీలకంగా మారిన ఫుటేజ్