మరో దుమారం రేపిన నిమ్మగడ్డ.. సుజనా, కామినేనితో భేటీ.. కీలకంగా మారిన ఫుటేజ్

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఈ నెల 13న నిమ్మగడ్డ.. బీజేపీ నేతలైన కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిలతో భేటీ అయ్యారు.

మరో దుమారం రేపిన నిమ్మగడ్డ.. సుజనా, కామినేనితో భేటీ.. కీలకంగా మారిన ఫుటేజ్
Follow us

| Edited By:

Updated on: Jun 23, 2020 | 1:15 PM

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఈ నెల 13న నిమ్మగడ్డ.. బీజేపీ నేతలైన కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిలతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆ ముగ్గురు భేటీ అవ్వగా.. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ తాజాగా బయటకు వచ్చింది.

13వ తేది ఉదయం గం.10:47ని.లకు సుజనా చౌదరి, గం.11.23ని.లకు కామినేని, గం.11.44ని.లకు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ హోటల్‌కి రాగా.. ఆ ముగ్గురినీ ఒకరే రిసీవ్ చేసుకున్నారు. ఆ తరువాత ఒకే గదిలో దాదాపు గంటకు పైగానే ఆ ముగ్గురు మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియోపై అధికార వైసీపీ పార్టీ నేతలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.  రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నానంటూ వాదనలు చేస్తున్న రమేష్‌కుమార్‌కు రాజకీయనేతలతో మంతనాలు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై నిమ్మగడ్డ తీవ్ర ఆరోపణల వెనుక కుమ్మక్కు ఉందన్న తమ వాదనకు బలం ఇదేనని వారు చెబుతున్నారు. కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో, ఇదే కేసులో పిల్‌ వేసిన వ్యక్తితో నిమ్మగడ్డ చర్చలు, వారి కుమ్మక్కును తెలియజేస్తున్నాయన్న వైసీపీ నేతలు మండిపడుతున్నారు. నిమ్మగడ్డ నిష్పక్షపాత మనిషికాదని, పక్షపాత మనిషి అని వీడియో ఆధారాలతో రుజువయ్యిందని.. ప్రభుత్వంపై ఆరోపణలపై కుట్ర కూడా బయటపడిందన్న అధికారపార్టీ నేతలు చెబుతున్నారు.

కాగా గత కొన్ని నెలలుగా ఏపీలో నిమ్మగడ్డ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ ప్రతిపక్షానికి వత్తాసు పలుకుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది. అంతేకాదు ఆయనను తొలగిస్తూ ఓ ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించడం, న్యాయస్థానం నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాలని ఆదేశించడం.. ఇప్పుడు ఈ అంశంపై సుప్రీం కోర్టులో విచారణలు జరుగుతున్న క్రమంలో.. ఆయన బీజేపీ నేతలతో భేటీ అవ్వడం సంచలనం రేపుతోంది.

Read This Story Also: లాంచ్ అయిన యాపిల్ కొత్త ఫోన్.. వినూత్న ఫీచర్లు ఇవే

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు