రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా విజయవాడలో నేడు పెట్టుబడుల సదస్సు ప్రారంభమైంది.హోటల్ గేట్‌వేలో ఈ సదస్సును సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. భారత విదేశాంగశాఖ సమన్వయంతో ఈ సదస్సు జరగనుండగా..ఈ కార్యక్రమాలు 35దేశాల నుంచి 40మంది రాయబారులు, కాన్సులేట్ జనరల్స్ హాజరయ్యారు. వారిలో కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, పోలెండ్, బల్గేరియా, బంగ్లాదేశ్, బ్రిటన్, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, శ్రీలంక, అంగోలా తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు.
ఇక ఈ సదస్సులో ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్, స్టీల్, టెక్స్‌టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి ప్రధాన రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో ఉన్న అవకాశాలను ఆయా దేశాల ప్రతినిథులకు వివరించనున్నారు. పెట్టుబడుల సదస్సు సందర్బంగా వివిధ దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. ఇక కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఈ సదస్సు ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.