AP Weather Report : రానున్న 3 రోజుల్లో ఏపీలో ఓ మోస్తారు వర్షాలు..! అనంతపురం, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు

|

Aug 23, 2021 | 1:42 PM

AP Weather Report : ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ ఒడిశా తీరం

AP Weather Report : రానున్న 3 రోజుల్లో ఏపీలో ఓ మోస్తారు వర్షాలు..! అనంతపురం, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు
Skymet Weather
Follow us on

AP Weather Report : ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ ఒడిశా తీరం వరకు విస్తరించింది. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులలో వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ: ఈ రోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అనంతపురం, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు.

తక్కువ ఎత్తులో ఆగ్నేయ, దక్షిణ గాలులు వీయడం వల్ల ఈరోజు, రేపు ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా వర్షం లేకుండా ఉరుములు మెరుపులతో వాతావరణం మారనుంది.

PPF: మీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉపయోగించక నిష్క్రియంగా మారిందా? దానిని తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..!

వ్యాక్సిన్ వేయించుకోని వారికి షాకింగ్ న్యూస్.. ఇది తెలుసుకోండి మీ కోసమే..:Shocking Not Been vaccinated Video.

కులగణన ఒక్కసారైనా జరగాలని నితీష్ కుమార్ పట్టు.. ప్రధాని మోడీని కలిసిన 10పార్టీల బృందం