Payyavula Keshav: జమా ఖర్చులకు సంబంధించి లెక్క తేలడం లేదని గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన పయ్యావుల

|

Jul 08, 2021 | 8:47 PM

ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ(పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) ఛైర్మన్ పయ్యావుల కేశవ్.. ఇవాళ (గురువారం) ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను..

Payyavula Keshav: జమా ఖర్చులకు సంబంధించి లెక్క తేలడం లేదని గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన పయ్యావుల
Payyavula
Follow us on

PAC Chairman Payyavula – AP Governor : ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ(పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) ఛైర్మన్ పయ్యావుల కేశవ్.. ఇవాళ (గురువారం) ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. 41 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ జమా ఖర్చులకు సంబంధించి లెక్క తేలడం లేదని కేశవ్.. గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఏ రశీదు లేకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలను ఎలా ఖర్చు చేశారని ఆయన తన లేఖ ద్వారా నిలదీసే ప్రయత్నం చేశారు.

తామేమీ కాకి లెక్కలు చెప్పడం లేదనీ.. కాగ్ రిపోర్టుల ఆధారంగానే మాట్లాడుతున్నామనీ కేశవ్ గవర్నర్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. “ప్రభుత్వ వ్యవస్థల్లో వంద రూపాయలు ఖర్చు చేయాలన్నా వంద సంతకాలు అవసరం.. అలాంటిది వేల కోట్ల రూపాయలను ఎలాంటి బిల్లులు లేకుండా ఎలా ఆమోదిస్తారు.?” అని టీడీపీ సీనియర్ నేత జగన్ సర్కారుని ప్రశ్నించారు.

Read also: KTR: మరోసారి తన మానవతను, మంచి మనసును చాటుకున్న మంత్రి కేటీఆర్