స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎన్నిక ఏకగ్రీవం

| Edited By:

Jun 13, 2019 | 9:55 AM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైఎసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. స్పీకర్ పదవికి బుధవారం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో సీతారాం ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇవాళ ఆయన ఎన్నికను లాంఛనంగా ప్రకటించనున్నారు. స్పీకర్‌గా తమ్మినేని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పలువురు మంత్రులతో సహా 30మంది ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌గా తమ్మినేని ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. అయితే ఆముదాలవలస నుంచి ఆరు […]

స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎన్నిక ఏకగ్రీవం
Follow us on

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైఎసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. స్పీకర్ పదవికి బుధవారం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో సీతారాం ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇవాళ ఆయన ఎన్నికను లాంఛనంగా ప్రకటించనున్నారు. స్పీకర్‌గా తమ్మినేని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పలువురు మంత్రులతో సహా 30మంది ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌గా తమ్మినేని ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. అయితే ఆముదాలవలస నుంచి ఆరు సార్లు ఎన్నికైన తమ్మినేని.. మూడు సార్లు మంత్రిగా కూడా చేశారు.