తమిళనాడు అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు. తీవ్ర కరువు పరిస్థితుల్లో ‘తెలుగు గంగ’ నీరిచ్చి తమ రాష్ట్ర ప్రజలను ఆదుకున్నారంటూ ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి అసెంబ్లీ సాక్షిగా జగన్‌కు అభినందనలు తెలిపారు.
అయితే 2018లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో 2019లో చెన్నై, శివారు ప్రాంతాలు నీటి కటకటను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీంతో జగన్‌ను స్వయంగా కలిసిన తమిళనాడు మంత్రులు తెలుగు గంగ పథకం కింద తమ రాష్ట్రానికి కేటాయించిన నీటిని విడుదల చేయాలంటూ విఙ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన జగన్.. ఆ రాష్ట్రానికి నీటిని విడుదల చేశారు. దీంతో నీటి ఎద్దడి నుంచి కాస్త ఉపశమనం లభించిందని సీఎం పళని స్వామి అసెంబ్లీలో తెలిపారు. కాగా తమిళనాడులో ఈ నెల 6న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు గురువారం ముగిశాయి.