AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతిలో కీచక పర్వం..

అమరావతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ జంటపై లైంగిక వేధింపులకు గురిచేస్తున్న కీచక ఎస్సై భాగోతం బయటపడింది. పెదకూరపాడు మండలానిక చెందిన ఓ జంట ఏకాంతంగా గడిపేందుకు సోమవారం అమరావతిలోని ఓ ప్రైవేటు లాడ్జిలో దిగారు....

అమరావతిలో కీచక పర్వం..
Sanjay Kasula
| Edited By: |

Updated on: Jun 10, 2020 | 9:43 AM

Share

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ జంటపై లైంగిక వేధింపులకు గురిచేస్తున్న కీచక ఎస్సై భాగోతం బయటపడింది. పెదకూరపాడు మండలానిక చెందిన ఓ జంట ఏకాంతంగా గడిపేందుకు సోమవారం అమరావతిలోని ఓ ప్రైవేటు లాడ్జిలో దిగారు. అయితే విశ్రాంతి నెపంతో లాడ్జికి వచ్చిన స్థానిక ఎస్సై రామాంజనేయులు… వారిని గమనించి కేసు నమోదు చేస్తానంటూ బెదిరింపులకు గురిచేశారు. వదిలిపెట్టేందుకు రూ. 10 వేలు లంచం డిమాండ్ చేయగా… వారు రూ. 5 వేలు ఇస్తామని చెప్పారు. అయితే తమ వద్ద ఉన్న రూ.3 వేలు ఇచ్చి మరో రూ. 2 వేల కోసం అక్కడికి సమీపంలో ఉన్న ఏటీఎంకు డ్రైవర్‌ను ఇచ్చి పంపించాడు ఎస్సై. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ వ్యక్తి తిరిగి అక్కడికి చేరుకునే వరకు ఎస్సై మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. మహిళ తరగబడటంతో వదిలిపెట్టాడు.  ఎవరికైనా విషయాన్ని చెబితే కేసు నమోదు చేస్తానంటూ హెచ్చరించాడు. వారి వివరాలు తీసుకుని విడిచిపెట్టాడు. అయితే బాధితులు మంగళవారం ఎస్సై రామాంజనేయులపై తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస రెడ్డికి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ మొదలు పెట్టారు. ఎస్సైతోపాటు అతనికి సహకరించిన డ్రైవర్‌పై కూడా చర్యలు తీసుకుంటున్నారు.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు