ఏపీ సీఎం జగన్ సలహాదారుగా సజ్జల

అమరావతి : అనుకున్ననట్టుగానే వైసీపీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం సలహాదారుగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి సలహాదారుగా సజ్జలను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు కేబినేట్ హోదా కూడా కల్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి నియమాకం తక్షణం అమలులోకి రానుంది. సజ్జల రామకృష్ణారెడ్డి జర్నలిస్టుగా అపార అనుభవం ఉంది. ఆయన సాక్షి పత్రికకు చాలా కాలం ఎడిటోరియల్ డైరక్టర్‌గా పనిచేశారు. వైసీపీ ప్రతిపక్షంలో […]

ఏపీ సీఎం జగన్ సలహాదారుగా సజ్జల

Edited By:

Updated on: Jun 18, 2019 | 9:23 PM

అమరావతి : అనుకున్ననట్టుగానే వైసీపీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం సలహాదారుగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి సలహాదారుగా సజ్జలను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు కేబినేట్ హోదా కూడా కల్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి నియమాకం తక్షణం అమలులోకి రానుంది. సజ్జల రామకృష్ణారెడ్డి జర్నలిస్టుగా అపార అనుభవం ఉంది. ఆయన సాక్షి పత్రికకు చాలా కాలం ఎడిటోరియల్ డైరక్టర్‌గా పనిచేశారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాయిస్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన విశేష కృషి చేశారు. వివిధ జిల్లాల్లో పార్టీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన ఆయన గత ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికకు జగన్‌కు పలు కీలక సలహాలు ఇచ్చారు.