వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ మహిళా నేత సాధినేని యామిని నిప్పులు చెరిగారు. గాలికి సచివాలయంలో టెంట్ పడితే నానా యాగీ చేస్తున్న విజయసాయిరెడ్డికి హుద్ హుద్ తుఫాన్ కనిపించలేదా? అని అడిగారు. ఉపాధి హామీ పథకం అమలు చూసి కేంద్రం ఏపీకి అవార్డులు ఇచ్చిందన్నారు. కానీ నిధులు రాకుండా వైసీపీ ఆపాలని చూసిందని ఆరోపించారు. టీడీపీపై విషం చిమ్మడమే విజయసాయిరెడ్డి ధ్యేయమని విమర్శించారు. విజయసాయిరెడ్డి పేరు వీసా రెడ్డిగా మార్చుకున్నారన్నారు. మే 23 తర్వాత విజయసాయిరెడ్డి విదేశాలకు పారిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.