Vijayawada: బెజవాడలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. హద్దు దాటితే కఠిన చర్యలు: సీపీ రాణా

Restrictions on New Year celebrations: న్యూ ఇయర్ వేడుకలకు అంతా రేడి అయింది.. ఓ వైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. ఈ క్రమంలో పలుచోట్ల ప్రభుత్వాలు

Vijayawada: బెజవాడలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. హద్దు దాటితే కఠిన చర్యలు: సీపీ రాణా
Vijayawada Cp

Updated on: Dec 30, 2021 | 3:50 PM

Restrictions on New Year celebrations: న్యూ ఇయర్ వేడుకలకు అంతా రేడి అయింది.. ఓ వైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. ఈ క్రమంలో పలుచోట్ల ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో విజయవాడ పోలీసులు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విజయవాడ పట్టణంలో ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రేపు రాత్రి (డిసెంబర్ 31న) వేడుకలకు అనుమతి లేదని విజయవాడ కమిషనర్ క్రాంతి రాణా టాటా స్పష్టంచేశారు. అర్ధరాత్రి 12 వరకు మాత్రమే ఇండోర్ వేడుకలకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. అర్ధరాత్రి రోడ్లపై ఎవరూ తిరగకూడదంటూ హెచ్చరించారు.

బెజవాడలో న్యూ ఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. 144 సెక్షన్, 30 యాక్ట్ అమలులో ఉందన్నారు. న్యూ ఇయర్ వేడుకలు రోడ్లపై చేస్తే కుదరదంటూ హెచ్చరించారు. 12 గంటల వరకు కోవిడ్ నిబంధనల ప్రకారం వేడుకలు జరుపుకోవాలన్నారు. న్యూఇయర్ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా 15 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు రాణా టాటా తెలిపారు. మద్యం మత్తులో గానీ, క్షణికావేశంలో తప్పులు చేసి నూతన సంవత్సరాన్ని బాధాకరంగా మార్చుకోవద్దంటూ యువతను హెచ్చరించారు.

Also Read:

EPFO E- Nomination: ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ పని డిసెంబర్‌ 31 తర్వాత కూడా చేయవచ్చు

Viral: టెన్త్ క్లాస్ స్టూడెంట్‌తో ప్రేమలో పడ్డ లేడీ టీచర్.. చివరకు ఏం జరిగిందంటే..?