విజయసాయికి తీపికబురు

|

Sep 07, 2020 | 9:15 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ, ఆపార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డికి ఇది ఒక తీపికబురు. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ని రాషష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం కొట్టివేశారు.

విజయసాయికి తీపికబురు
Follow us on

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ, ఆపార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డికి ఇది ఒక తీపికబురు. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ని రాషష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం కొట్టివేశారు. విజయసాయి రెడ్డి లాభదాయక పదవి నిర్వహిస్తున్నారంటూ దాఖలైన ఫిర్యాదుపై రాష్ట్రపతి ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించారు. కాగా ఈ అంశానికి సంబంధించి రాష్ట్రపతి కేంద్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయం తీసుకున్నారు. పార్లమెంటు అనర్హత నిరోధక చట్టం, న్యాయస్థానాల తీర్పు మేరకు అనర్హత వర్తించదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈసీ అభిప్రాయం మేరకు రాష్ట్రపతి, విజయసాయి రెడ్డిపై దాఖలైన అనర్హత పిటిషన్‌ని కొట్టివేశారు. జీవో 75 ప్రకారం ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఎటువంటి జీతభత్యాలు తీసుకోవడం లేదని వెల్లడవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విధినిర్వహణలో, ఏపీ పర్యటనలో కేవలం రాష్ట్ర అతిథిగా మాత్రమే ఉన్నారని సదరు జీవోలో వివరణ ఇచ్చారు.