బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. చంద్రబాబు ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

Jan 12, 2020 | 4:47 PM

నరసరావుపేట పర్యటనుకు బయల్దేరిన టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును పోలీసులు అడ్డుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి ఆయన బైక్ ర్యాలీని ప్రారంభించగా.. పోలీసులు అడ్డుకొని నిలిపివేశారు. బైక్ తాళాలను పోలీసులు తీసుకున్నారు. అయితే బైక్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల ర్యాలీలకు అనుమతిని ఇస్తూ.. తమ వెంట వస్తున్న కార్యకర్తలను అడ్డుకోవాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ఏపీ […]

బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. చంద్రబాబు ఫైర్
Follow us on

నరసరావుపేట పర్యటనుకు బయల్దేరిన టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును పోలీసులు అడ్డుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి ఆయన బైక్ ర్యాలీని ప్రారంభించగా.. పోలీసులు అడ్డుకొని నిలిపివేశారు. బైక్ తాళాలను పోలీసులు తీసుకున్నారు. అయితే బైక్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల ర్యాలీలకు అనుమతిని ఇస్తూ.. తమ వెంట వస్తున్న కార్యకర్తలను అడ్డుకోవాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు.

మరోవైపు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ‘‘అమరావతి రాజధానిగా కోరుతూ ప్రజలు శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే అడ్డుకుంటున్నారు. పోలీసులు దుర్గమ్మ గుడికి వెళ్తున్న మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారు. ఇవన్నీ ప్రజా హక్కులను కాలరాయడం కాదా..? పోలీసుల వివక్షపూరిత వైఖరికి డీజీపీ బాధ్యత వహించాలి. చట్టబద్ధ చర్యలకు కూడా డీజీపీదే బాధ్యత. ఇకనైనా చట్టానికి, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజా హక్కులను కాపాడేలా వ్యవహరించాలి’’ అని బాబు ఆ లేఖలో పేర్కొన్నారు.