చంద్రబాబును ఉండవల్లిలో విడిచిపెట్టిన పోలీసులు

| Edited By:

Jan 09, 2020 | 6:12 AM

విజయవాడలోని బెంజ్‌‌సర్కిల్‌ వద్ద ఆందోళన తీవ్రతరం కావడంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు సహా అమరావతి పరిరక్షణ సమితి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు, నారా లోకేశ్‌, ఇతర టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని వాహనంలో అక్కడినుంచి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితిలు ఉద్రిక్తంగా మారుతుండటంతో.. వారిని నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద వదిలిపెట్టారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అంతకుముందు టీడీపీ […]

చంద్రబాబును ఉండవల్లిలో విడిచిపెట్టిన పోలీసులు
Follow us on

విజయవాడలోని బెంజ్‌‌సర్కిల్‌ వద్ద ఆందోళన తీవ్రతరం కావడంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు సహా అమరావతి పరిరక్షణ సమితి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు, నారా లోకేశ్‌, ఇతర టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని వాహనంలో అక్కడినుంచి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితిలు ఉద్రిక్తంగా మారుతుండటంతో.. వారిని నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద వదిలిపెట్టారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.

అంతకుముందు టీడీపీ అధినేతకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బెంజ్ సర్కిల్‌ ప్రాంతంలో జేఏసీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఆటోనగర్ వరకు జేఏసీ నేతలతో కలిసి పాదయాత్ర ద్వారా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, జేఏసీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పరిస్థితి తీవ్రతరం కావడంతో చంద్రబాబు, లోకేష్‌తో సహా జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవినేని ఉమ, అశోక్ బాబు, రామానాయుడు, అచ్చెన్నాయుడు, పంచుమర్తి అనురాధ, ప్రత్తిపాటి పుల్లారావులను అరెస్ట్ చేశారు. దీనితో సీఎం డౌన్ డౌన్ అంటూ అఖిలపక్ష నేతలు నినాదాలు చేస్తున్నారు.