దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి..? పవన్ ఫైర్

జనసేన పార్టీకి చెందిన దాదాపు 400 మంది ట్విట్టర్ ఖాతాలను ఆ సంస్థ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జనసేన కార్యకర్తల ట్విటర్‌ ఖాతాలను ఎందుకు నిలిపివేశారని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశ్నించారు. ‘400 మంది జనసేన కార్యకర్తల ట్విటర్‌ ఖాతాలను ఎందుకు నిలిపివేశారో నాకు అర్థం కావడం లేదు. అవసరాల్లో ఉన్న సామాన్యుల తరఫున నిలబడి, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నందుకు ఖాతాలను నిలిపివేశారా? […]

దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి..? పవన్ ఫైర్

Edited By:

Updated on: Sep 19, 2019 | 8:47 AM

జనసేన పార్టీకి చెందిన దాదాపు 400 మంది ట్విట్టర్ ఖాతాలను ఆ సంస్థ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జనసేన కార్యకర్తల ట్విటర్‌ ఖాతాలను ఎందుకు నిలిపివేశారని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశ్నించారు. ‘400 మంది జనసేన కార్యకర్తల ట్విటర్‌ ఖాతాలను ఎందుకు నిలిపివేశారో నాకు అర్థం కావడం లేదు. అవసరాల్లో ఉన్న సామాన్యుల తరఫున నిలబడి, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నందుకు ఖాతాలను నిలిపివేశారా? దీన్ని మేం ఎలా స్వీకరించాలి, అర్థం చేసుకోవాలి?’ అని ట్వీట్ చేసిన ఆయన #BringBackJSPSocialMedia అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఇక ఆ ట్యాగ్‌ను ఇప్పుడు జనసైనికులు ట్రెండ్ చేస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో జనసైనికులు యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలో ఇటీవల ‘సేవ్ నల్లమల’, ‘వైఎస్ జగన్ ఫెయిల్డ్ సీఎం’ అనే క్యాంపెయిన్‌లపై వారు విస్తృత ప్రచారం చేస్తున్నారు.