Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో గ్రూప్-1,2 ఉద్యోగాలకు నోటిఫికేషన్..

|

Oct 04, 2021 | 3:13 PM

ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.సీతారామాంజనేయులు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు.. త్వరలో పలు పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు...

Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో గ్రూప్-1,2 ఉద్యోగాలకు నోటిఫికేషన్..
Job
Follow us on

ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.సీతారామాంజనేయులు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు.. త్వరలో పలు పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. 190 అసిస్టెట్ ఇంజినీర్ ఉద్యోగాలకు వారంలోగా నోటిఫికేషన్ ఇస్తామన్న ఆంజనేయులు… త్వరలో 670 జూనియర్ అసిస్టెంట్స్ పోస్టులకు, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతోందన్న ఆయన.. క్యాలెండర్‌ ఇస్తే పరీక్ష తేదీలు ఖరారు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయన్నారు.

ముందుగా నోటిఫికేషన్లు ఇచ్చి దరఖాస్తులు తీసుకుంటామని… తర్వాత పరీక్ష తేదీలు ప్రకటిస్తామన్నారు. ఖాళీ పోస్టులు వివరాలు ప్రభుత్వం నుంచి రావాలన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు పెరిగే అవకాశం ఉందని సీతారామాంజనేయులు తెలిపారు. గ్రూప్‌ -1 మెయిన్స్ జవాబు పత్రాలను మాన్యువల్​గానే మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామన్నారు. 3 నెలల్లో మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు.

Read Also.. Viral Video: సీఐకి హిజ్రాల సన్మానం.. రీజన్‌ ఏంటో తెలుసా.? ఇలాంటివి అరుదుగా జరుగుతాయి అంటున్న నెటిజన్లు(వీడియో)