YS Jagan: ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల జాతర.. సామాజిక న్యాయానికి పెద్దపీట

|

Jul 17, 2021 | 2:08 PM

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ నేతృత్వంలోని పెద్ద ఎత్తున నామినేటెడ్‌ పోస్టులను ఇవాళ ప్రకటించింది. మహిళలు, వెనకబడిన వర్గాలు, దళితులకు నియామకాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు...

YS Jagan: ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల జాతర..  సామాజిక న్యాయానికి పెద్దపీట
Sajjala Ramakrishna Reddy
Follow us on

Nominated posts: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున నామినేటెడ్‌ పోస్టులను ఇవాళ ప్రకటించారు. మహిళలు, వెనకబడిన వర్గాలు, దళితులకు నియామకాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించగా, 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు దక్కాయి.

ఇక, ఏపీఐఐసీ చైర్మన్‌గా మెట్టు గోవర్ధన్‌రెడ్డి, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా అడపా శేషు, రాష్ట్ర విద్యావిభాగం చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా సుధాకర్‌ సతీమణి, రాష్ట్ర మైనార్టీ విభాగం చైర్మన్‌గా జాన్ వెస్లీ, రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్‌గా దాడి రత్నాకర్, ఏపీ ఎండీసీ చైర్మన్‌గా అస్లాం (మదనపల్లి) నియమితులయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నామినేటెడ్‌ పదవులు అలంకార ప్రాయం కాదని.. పదవులు తీసుకున్నవారు బాధ్యతాయుతంగా ఉండాలని సజ్జల సూచించారు.

నామినేటెడ్ పదవుల పంపకం వివరాలిలా ఉన్నాయి:

> శ్రీకాకుళం జిల్లా: మొత్తం  7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు

> విజయనగరం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5

> విశాఖ జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5

> తూర్పు గోదావరి: 17 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 9

> పశ్చిమగోదావరి: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6

> కృష్ణా జిల్లా : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6

> గుంటూరు జిల్లా : 9 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6

> ప్రకాశం జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5

> నెల్లూరు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5

> చిత్తూరు జిల్లా: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 7

> అనంతపురం : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5

> వైఎస్సార్‌ జిల్లా: 11 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6

కర్నూలు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు.

Read also: Raj Bhavan: తలవంపులు తెచ్చిన కేసు.! : రాజ్ భవన్‌కు కాంగ్రెస్ జెండాలు కట్టిన వ్యవహారంలో సీరియస్.. అరెస్టులు