బందరు పోర్టుపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ సంచలన కామెంట్స్ చేశారు. పోర్టు గురించి ఓ పత్రికలో వచ్చిన వార్తను ప్రస్తావిస్తూ.. ఆయన ట్వీట్ చేశారు. ఈరోజు చేతకాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు. రేపు పాలన కూడా చేతకావట్లేదని రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడతారా..? అని నారాలోకేష్ మండిపడ్డారు. ఇలాంటి అసమర్ధులు ఒక్క ఛాన్స్ ఎందుకోసం అడిగారు..? దోచుకోవడానికా..? ప్రజల భవిష్యత్తును పక్క రాష్ట్రాలు తాకట్టు పెట్టడానికా అని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఈరోజు చేతకాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు. రేపు పాలన కూడా చేతకావట్లేదని రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడతారా? ఇలాంటి అసమర్థులు ఒక్క ఛాన్స్ ఎందుకోసం అడిగారు? దోచుకోడానికా? ప్రజల భవిష్యత్తును పక్క రాష్ట్రాలకు తాకట్టుపెట్టడానికా? pic.twitter.com/WVt4pLsqn4
— Lokesh Nara (@naralokesh) July 29, 2019