బాధ్యతలు స్వీకరించిన ఏపీ మంత్రి..తొలి సంతకం దేనిపై అంటే?

అమరావతి: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా కన్నబాబు శనివారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. రైతు భరోసా పథకం అమలు ఫైల్‌పై తొలి సంతకం చేశారు. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, పలువురు నేతలు మంత్రికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు రైతు భీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ‘ధరల స్థిరీకరణ నిధి రూ.3000 కోట్లతో ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. […]

బాధ్యతలు స్వీకరించిన ఏపీ మంత్రి..తొలి సంతకం దేనిపై అంటే?

Updated on: Jun 22, 2019 | 2:02 PM

అమరావతి: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా కన్నబాబు శనివారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. రైతు భరోసా పథకం అమలు ఫైల్‌పై తొలి సంతకం చేశారు. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, పలువురు నేతలు మంత్రికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు రైతు భీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ‘ధరల స్థిరీకరణ నిధి రూ.3000 కోట్లతో ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. సహకార సొసైటీల ఆధునీకరణ కోసం రూ.120  కోట్లు విడుదల చేస్తున్నాం. నకిలీ విత్తనాలు చలామణి అవుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. తక్షణమే అరికట్టి వ్యాపారులపై తీవ్ర చర్యలు తీసుకుంటాం. మిర్చి, పత్తి విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వాటిని అరికడతాం. ఒక కంపెనీ కేజీ విత్తనాలు లక్షన్నరకు అమ్ముతోంది. ఆ కంపెనీపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి తెలిపారు.