త్వరలో ఏపీ మంత్రి రాజీనామా! కారణమేంటంటే?

త్వరలో ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయనున్నారు. ఐతే దీని వెనక ఎలాంటి రాజకీయ కారణాలు లేవు. సాంకేతిక కారణాలతోనే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పటికే కిడారి శ్రవణ్‌కు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కార్యాలయం నుంచి సందేశం వెళ్లినట్లు తెలుస్తోంది. ఐతే ఇప్పటివరకు తనకు ఎలాంటి సందేశం అందలేదని శ్రవణ్ చెబుతున్నారు.  గత ఏడాది అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల దాడిలో మరణించారు. అనంతరం ఆయన […]

త్వరలో ఏపీ మంత్రి రాజీనామా! కారణమేంటంటే?
Follow us
Ram Naramaneni

| Edited By:

Updated on: May 08, 2019 | 3:47 PM

త్వరలో ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయనున్నారు. ఐతే దీని వెనక ఎలాంటి రాజకీయ కారణాలు లేవు. సాంకేతిక కారణాలతోనే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పటికే కిడారి శ్రవణ్‌కు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కార్యాలయం నుంచి సందేశం వెళ్లినట్లు తెలుస్తోంది. ఐతే ఇప్పటివరకు తనకు ఎలాంటి సందేశం అందలేదని శ్రవణ్ చెబుతున్నారు.  గత ఏడాది అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల దాడిలో మరణించారు. అనంతరం ఆయన కుమారుడు కిడారి శ్రవణ్ అనూహ్యంగా రాజకీయ అరంగ్రేటం చేశారు. ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. 2018 నవంబరు 11న గవర్నర్‌ నరసింహన్‌ కిడారి శ్రవణ్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనకు వైద్యఆరోగ్య శాఖ, గిరిజన సంక్షేమశాఖ మంత్రిత్వ బాధ్యతలను అప్పజెప్పారు చంద్రబాబు.

కిడారి శ్రవణ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవి లేకుండానే నేరుగా మంత్రి అయ్యారు. ఐతే మంత్రిగా నియమితులైన నేత.. 6 నెలల్లోపు ఖచ్చితంగా చట్టసభల్లో సభ్యుడై ఉండాలి. కానీ ఇప్పటి వరకు కిడారి శ్రవణ్ ఇటు అసెంబ్లీ గానీ..అటు శాసనమండలికి గానీ ప్రాతినిధ్యం వహించలేదు. మే 10 నాటికి కిడారి శ్రవణ్ మంత్రి పదవి చేపట్టి 6 నెలలు నిండుతుంది. దాంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడం అనివార్యమైంది. మరో రెండు రోజులే గడువు ఉండడంతో ఏపీ చంద్రబాబు నాయుడిని కలిసి..ఆయన సూచన మేరకు కిడారి శ్రవణ్ రాజీనామా చేస్తారని సమాచారం.