Posani vs Janasena: పోసానివి అనుచిత వ్యాఖ్యలంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

|

Sep 30, 2021 | 2:09 PM

టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు జనసేన నేతలు.

Posani vs Janasena:  పోసానివి అనుచిత వ్యాఖ్యలంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
Posani Murali
Follow us on

Posani Vs Janasena: టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు జనసేన నేతలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆయన కుటుంబ సభ్యుల పై పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటూ దీనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తాడేపల్లి పోలీసులను కోరారు జనసైనికులు. ఇలా ఉండగా, మాటల్లేవు. మాట్లాడుకోటాల్లేవు. ఇక రాళ్లేతోనే పని. భీమ్లా నాయక్‌ Vs బీప్‌..లా నాయక్‌ ఎపిసోడ్‌లో వైలెంట్‌ సీన్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. డైనమైట్ల లాంటి డైలాగ్‌లు దాడుల వరకు వెళ్లాయి. ఇళ్లపై ఇటుకలతో దాడుల వరకు వ్యవహారం వెళ్లింది. మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి.

రిపబ్లిక్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఈవెంట్‌ నుంచి ఎన్నో ట్విస్ట్‌లు, మరెన్నో టర్నింగ్‌లు. పోసాని కామెంట్లు, ఆ తర్వాత జనసైనికుల రియాక్షన్‌ మరింత హీట్‌ పెంచేస్తోంది. సోమాజిగూడ్‌ ప్రెస్‌క్లబ్‌ దగ్గర ఎపిసోడ్‌కి కంటిన్యూగా పోసాని కృష్ణమురళీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. హైదరాబాద్‌ ఎల్లారెడ్డిగూడలోని ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఇటుక రాళ్లు విసిరేశారు. అయితే 8 నెలల నుంచి పోసాని కుటుంబం మరో చోట ఉంటోంది.

దాడి జరిగిన ఇంట్లో వాచ్‌మన్‌ ఫ్యామిలీ కాపలాగా ఉంటోంది. దాడి టైమ్‌లో వాచ్‌మన్‌ దంపతులు ఇద్దరూ బయటే నిద్రపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి అరుస్తున్నప్పుడు లేచి పరుగులు పెట్టారు. ఆలోపే ఇటుక రాళ్లను పోసాని ఇంట్లోకి విసిరేశారు గుర్తు తెలియని వ్యక్తులు. రెండు రోజుల నుంచి ఇంటి చుట్టూ కొందరు వ్యక్తులు తిరుగుతూ పోసానిని బండ బూతులు తిడుతున్నారని, నిన్న రాత్రి మాత్రం రాళ్లతో దాడి చేశారని చెప్పారు వాచ్‌మన్‌ భార్య శోభ.

పోసాని ఫిర్యాదుతో సీసీ కెమెరా ఫుటేజ్‌ పరిశీలిస్తున్నారు పోలీసులు. రెండు రోజుల కిందట సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి పవన్‌పై వ్యక్తిగతంగానూ విమర్శలు చేశారు పోసాని. అక్కడే ఆయన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు జనసేన కార్యకర్తలు, పవన్‌ ఫ్యాన్స్‌. అప్పుడే తనకు ఏం జరిగినా పవన్‌దే బాధ్యత అని ప్రకటించారు పోసాని. ఇప్పుడు ఆయన ఇంటిపై రాళ్లతో దాడి చేయడం సంచలనంగా మారింది.

ఇదే కాదు పవన్‌పై విమర్శలు చేసిన మంత్రి పేర్ని నానిని అడ్డుకోబోయారు జనసేన కార్యకర్తలు. పశ్చిమగోదావరి జిల్లా తుణుకులో ఈ ఘటన జరిగింది. మంత్రి కాన్వాయ్‌ వెళుతున్న సమయంలో ఒక్కసారిగా వాహనాలకు అడ్డొచ్చారు జనసేన కార్యకర్తలు. జనసేన జెండాలు పట్టుకుని పేర్ని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వెంటనే వారిని పక్కకు లాగేశారు. ఇది గమనించిన మంత్రి పేర్ని నాని వాహనంలో నుంచే విష్‌ చేస్తూ ముందుకు వెళ్లారు.

Read also: China’s Power Crisis: చైనాని చీకటి చేస్తోన్న విద్యుత్ సంక్షోభం.. ట్రాఫిక్ లైట్లు కూడా వెలగడం లేని స్థితి