అమరావతి: వైఎస్ జగన్ సర్కారు ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత పార్థసారధి మాట్లాడుతూ.. ‘బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి మధ్య సమతుల్యత లేదని.. పోలవరంపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. సున్నా వడ్డీ రుణాలకు 5 వేల కోట్లు కేటాయించాలని.. ప్రభుత్వ పథకాలకు దేశ నాయకుల పేర్లు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమంతో పాటు ఆర్ధిక పురోగతి కూడా రాష్ట్రానికి ఎంతో అవసరమేనని ఆయన అన్నారు.
బడ్జెట్‌లో సంక్షేమానికి, అభివృద్దికి మధ్య సమతుల్యత లేదు.#APBudget pic.twitter.com/pXWWMaqmZd
— JanaSena Party (@JanaSenaParty) July 13, 2019