ఏపీలో కొత్త అధ్యాయం.. నేటి నుంచి విధుల్లో గ్రామ వాలంటీర్లు..

| Edited By:

Aug 15, 2019 | 1:52 PM

73 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీలో కొత్త అధ్యాయం మొదలైంది. సీఎం హోదాలో తొలిసారిగా జాతీయ జెండాను ఆవిష్కరించిన జగన్ గ్రామ వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన వాలంటీర్లందరికి ఐడీ కార్డులు అందజేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన రెండున్నర లక్షలమంది వాలంటీర్లకు ప్రజా ప్రతినిధుల చేత ఐడీ కార్డులు అందేలా ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచే వీరి సేవలు మొదలయ్యాయి. గ్రామ వాలంటీర్లు మూడు పనులు చేయాల్సి […]

ఏపీలో కొత్త అధ్యాయం.. నేటి నుంచి విధుల్లో గ్రామ వాలంటీర్లు..
Follow us on

73 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీలో కొత్త అధ్యాయం మొదలైంది. సీఎం హోదాలో తొలిసారిగా జాతీయ జెండాను ఆవిష్కరించిన జగన్ గ్రామ వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన వాలంటీర్లందరికి ఐడీ కార్డులు అందజేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన రెండున్నర లక్షలమంది వాలంటీర్లకు ప్రజా ప్రతినిధుల చేత ఐడీ కార్డులు అందేలా ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచే వీరి సేవలు మొదలయ్యాయి. గ్రామ వాలంటీర్లు మూడు పనులు చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. నవరత్నాలు, మేనిఫెస్టోలోని ప్రతి పథకం వాలంటీర్ల ద్వారానే అమలవుతుందని అన్నారు. పథకాలకు అర్హులైన లబ్ధిదారుల్ని ఎంపిక చేసి.. మళ్లీ ఎన్నికలు వచ్చే నాటికి ప్రతి పథకం వారికి చేరువయ్యేలా విధులు నిర్వహించాలని జగన్ చెప్పారు. ఈ ఏడాదే 80 శాతం హామీలను అమలు చేస్తామని అన్నారు. వచ్చే ఏడాది మిగిలిన 20 శాతం పూర్తి చేస్తామన్నారు. పథకాల లబ్ధిదారుల్ని గుర్తించే బాధ్యత వాలంటీర్లదేనని జగన్ పేర్కొన్నారు.