టెన్త్ స్టూడెంట్స్‌కి గ్రేడ్‌లు ఎలా కేటాయిస్తారు?

| Edited By:

Jun 21, 2020 | 1:29 PM

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. నిజానికి గతంలో జులై 10 నుంచి 17వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినా.. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించింది...

టెన్త్ స్టూడెంట్స్‌కి గ్రేడ్‌లు ఎలా కేటాయిస్తారు?
Follow us on

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. నిజానికి గతంలో జులై 10 నుంచి 17వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినా.. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అలాగే టెన్త్‌‌తో పాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల్లో అందరినీ పాస్ చేయాలని నిర్ణయించింది ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షకు చెల్లించిన ఫీజును వాపస్ చేస్తామన్న ఆయన.. ప్రతిభ ఆధారంగానే గ్రేడింగ్ ఉంటుందని వివరించారు.

కాగా 2019-2020 విద్యా సంవత్సరంలో టెన్త్ స్టూడెంట్స్‌కి ఫార్మెటివ్ 4, సమ్మెటివ్ ఒకటి, ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించారు. ఫార్మెటివ్‌లో ఒక్కో సబ్జెక్ట్‌కి 50 మార్కులు, సమ్మెటివ్ 100 మార్కులకు నిర్వహించారు. ఈ లెక్కన నాలుగు ఫార్మెటివ్‌లు 200 మార్కులు, సమ్మెటివ్ 100 మార్కులు, మొత్తం 300 మార్కులను వంద మార్కులకు కుదించి గ్రేడ్లు ఇస్తారా? లేకుంటే కేవలం ఫార్మెటివ్‌లు 200 మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయిస్తారనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టెన్త్‌లో ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షల ఆధారంగా గ్రేడ్లు ఇస్తే ప్రవేటు విద్యా సంస్థల్లో చదివిన వారికి ఎక్కువగా గ్రేడ్ పాయింట్లు వచ్చే అవకాశం ఉందని ఆరోపణలు వస్తున్నాయి.

ఇక ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు దాదాపు 5 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 59 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే సెకండ్ ఇయర్ పరీక్షలకు 4,35,655 మంది విద్యార్థులు హాజరు కాగా 63 శాతం మంది పాస్ అయ్యారు. ఇక ఇప్పుడు ఏపీ సర్కార్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దైనందున ఇప్పుడు మిగతా వారందరూ ఉత్తీర్ణలు కానున్నారు. ఇక ఇప్పుడు వీటితో పాటు డిగ్రీ, పీజీ, డిగ్రీ పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అనే దానిప ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఉన్నత విద్యామండలి కసరత్తులు ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న కారణంగా పరీక్షల సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై సోమవారం అన్ని విశ్వ విద్యాలయాల ఉపకులపతులతో ప్రత్యేక సమావేశం కానున్నారు.

Read More:

వాహనదారులపై భారీ భారం.. 15 రోజుల్లో రూ.8 పెరుగుదల..

బ్రేకింగ్: కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్‌కి కరోనా పాజిటివ్..

విపరీతంగా కరోనా కేసులు.. ఉద్యోగులకు కీలక మార్గదర్శకాలు‌: హైకోర్టు

ఏపీ ఎమ్మెల్యే గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్..