జేసీ ఫ్యామిలీకి మరో షాక్.. హైకోర్టు నోటీసులు

| Edited By: Srinu

Nov 27, 2019 | 1:31 PM

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది. త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్‌స్టోన్ మైనింగ్ లీజ్ విషయంలో జేసీ కుమారుడు పవన్ రెడ్డి, కోడలు సంయుక్తారెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు త్రిశూల్ సిమెంట్ సంస్థలు, వ్యాపార భాగస్వామి వేణుగోపాల్ రెడ్డికి కూడా కోర్టు నోటీసులిచ్చింది. ఈ కేసులో మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన […]

జేసీ ఫ్యామిలీకి మరో షాక్.. హైకోర్టు నోటీసులు
Follow us on

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది. త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్‌స్టోన్ మైనింగ్ లీజ్ విషయంలో జేసీ కుమారుడు పవన్ రెడ్డి, కోడలు సంయుక్తారెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు త్రిశూల్ సిమెంట్ సంస్థలు, వ్యాపార భాగస్వామి వేణుగోపాల్ రెడ్డికి కూడా కోర్టు నోటీసులిచ్చింది. ఈ కేసులో మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 30కు వాయిదా వేసింది.

అయితే సున్నపురాయి మైనింగ్ లీజు కోసం త్రిశూల్ సిమెంట్ కంపెనీ మోసాలకు పాల్పడిందని, దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ 2011లో తాడిపత్రికి చెందిన వి.మురళీ ప్రసాదర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేశారు. ఇక ఈ కేసును విచారిస్తోన్న హైకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్‌లో జేసీ దివాకర్ రెడ్డి సహా త్రిశూల్ సంస్థ నిర్వహణ భాగస్వామి ఎస్ హుస్సేన్ భాషా, ఎస్. గోపాలరావు, తిమ్మాపురం దేవపుత్రుడు, జె. నాగ సుబ్బరాయుడు, కె. సిలాస్‌లకు నోటీసులిచ్చింది. ఇదే కేసులో తాజాగా జేసీ కుమారుడు, కోడలికి నోటీసులు అందాయి.