వెద‌ర్ వార్నింగ్ః ఏపీలో రాగ‌ల మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు..

| Edited By:

Jul 28, 2020 | 5:54 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త కొన్ని రోజుల నుంచి వ‌రుస‌గా భారీ వ‌ర్షాలు ప‌డుతూనే ఉన్నాయి. క‌రోనా వైర‌స్‌కి తోడు ఈ వ‌ర్షాలు ప్ర‌జ‌ల‌ను మ‌రింత ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. తాజాగా ఈ రోజు, రేపు, ఎల్లుండి ఏపీలోని ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు భార‌త‌ వాతావ‌ర‌ణ శాఖ..

వెద‌ర్ వార్నింగ్ః ఏపీలో రాగ‌ల మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు..
Follow us on

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త కొన్ని రోజుల నుంచి వ‌రుస‌గా భారీ వ‌ర్షాలు ప‌డుతూనే ఉన్నాయి. క‌రోనా వైర‌స్‌కి తోడు ఈ వ‌ర్షాలు ప్ర‌జ‌ల‌ను మ‌రింత ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. తాజాగా ఈ రోజు, రేపు, ఎల్లుండి ఏపీలోని ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు భార‌త‌ వాతావ‌ర‌ణ శాఖ తెలియ‌జేసింది. గ‌త కొద్ది రోజుల పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైఋతి బంగాళాఖాతం ప్రాంతాలలో 5.8 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. దీంతో ఏపీలో రాగ‌ల మూడు రోజుల పాటు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

ఉత్త‌ర కోస్తాంధ్ర‌, యానాంలోని ప‌లు ప్రాంతాల్లో రాగ‌ల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. అక్క‌డ‌క్క‌డ భారీ వ‌ర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. అలాగే ద‌క్షిణ కోస్తాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో ఈ రోజు తేలిక‌పాటి నుండి ఒక మోస్త‌రు వ‌ర్షాలు కొన్నిచోట్ల ప‌డ‌నున్నాయి. ఇక రేపు, ఎల్లుండి అక్క‌డ‌క్క‌ భారీ వ‌ర్షాలు ప‌డే ఛాన్స్ ఉన్న‌ట్లు వెద‌ర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు.

Read More: 

ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్ః ఇక‌పై మ‌రింత ఈజీగా ట్రైన్ టికెట్ బుకింగ్‌..

ఏడో నిజాం కుమార్తె బ‌షీరున్నిసా బేగం మృతి

రామ్ గోపాల్ వ‌ర్మ‌కు షాక్.. రూ.4 వేల‌ ఫైన్ విధించిన జీహెచ్ఎంసీ..