భానుడి భగభగ.. ఏపీలోనే మృత్యుఘంటికలు

| Edited By: Pardhasaradhi Peri

Jun 13, 2019 | 5:04 PM

దేశవ్యాప్తంగా ఈ వేసవిలో భానుడు మరింత మండిపోయాడు. తాజాగా వాయు తుఫానుతో కొన్ని రాష్ట్రాలు చల్లబడినప్పటికీ.. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎండలు ఇప్పటికీ మండుతూనే ఉన్నాయి. కాగా ఈ ఎండలకు ఇప్పటివరకు భారత్‌లో 36 మంది మృతి చెందగా.. వారిలో ఎక్కువగా ఏపీ నుంచే ఉన్నట్లు జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ ఏడాది వేసవిలో మరణించిన వారికి సంబంధించిన రాష్ట్రాల వ్యాప్తంగా గణాంకాలు ఇంకా పూర్తి కాలేదని, కానీ ఏపీలోనే అత్యధికంగా […]

భానుడి భగభగ.. ఏపీలోనే మృత్యుఘంటికలు
Follow us on

దేశవ్యాప్తంగా ఈ వేసవిలో భానుడు మరింత మండిపోయాడు. తాజాగా వాయు తుఫానుతో కొన్ని రాష్ట్రాలు చల్లబడినప్పటికీ.. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎండలు ఇప్పటికీ మండుతూనే ఉన్నాయి. కాగా ఈ ఎండలకు ఇప్పటివరకు భారత్‌లో 36 మంది మృతి చెందగా.. వారిలో ఎక్కువగా ఏపీ నుంచే ఉన్నట్లు జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ ఏడాది వేసవిలో మరణించిన వారికి సంబంధించిన రాష్ట్రాల వ్యాప్తంగా గణాంకాలు ఇంకా పూర్తి కాలేదని, కానీ ఏపీలోనే అత్యధికంగా మరణించినట్లు ఆ శాఖ తెలిపింది. ఈ ఏడాది రాజస్థాన్‌లోని చురులో అత్యధికంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ.. అక్కడ ఒక్క మరణం కూడా నమోదు కాలేదని ఆ శాఖ పేర్కొంది.

దీనిపై ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖకు చెందిన అధికారి అనుప్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘‘ఉష్ణోగ్రతలతో పాటు గాలిలోని ఆర్ధత (తేమ శాతం) కూడా మానవుల మనుగడలో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా తుఫానులు సంభవించినప్పుడు వాతావరణంలోని తేమశాతం తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఏపీలోని వాతావరణానికి, చురులోని వాతావరణ పరిస్థితులకు మధ్య ఉన్న తేడా, ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గులే మరణాలకు కారణమవుతున్నాయి’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే వాయు తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే.